ఎదులాపురం : ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులను పరిశీలించి వెను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వినతి పత్రాలను ఆమె స్వీకరించారు. పాఠశాలల్లో ఉర్దూ మీడియం ఉపాధ్యాయులను నియమించాలని, గ్రామాలలో పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టాలని, దళిత అబివృద్ధి శాఖ నుంచి రుణాలు మంజూరు చేయాలని పలువురు కోరారు.
ఈ మేరకు జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎన్.నటరాజ్, ఆర్టీవో రాజేశ్వర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జడ్పీ సీఈవో గణపతి, డీపీవో శ్రీనివాస్, ఎల్డీఎం చంద్రశేఖర్, వివిధ సంక్షేమ శాఖ అధికారులు ఉన్నారు.