బాసర, నవంబరు 5 : బాసర సరస్వతీ క్షేత్రం బుధవారం మహిమానిత్వం అయింది. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని బాసర గోదారమ్మకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గోదావరి నదీ ఒడ్డున గల శివాలయంలో కార్తీక దీపాలు వెలిగించారు.
అర్చకుల వేద మంత్రోచ్చరణ మధ్య రెండు గంటలపాటు పూజలు చేశారు. అనంతరం గోదారమ్మకు మహాహారతి నిర్వహించారు. హారతి కార్యక్రమంలో నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ దంపతులు, ఆర్టీఐ కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి దంపతులతోపాటు ఎస్పీ జానకీ షర్మీల పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.