నల్ల సూర్యుల ఆశాకిరణం, సింగరేణి ప్రగతి ప్రధాత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు(మంగళవారం) చెన్నూర్ నియోజకవర్గంలో పర్యటించను న్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి, విప్ బాల్క సుమన్‌కు మద్దతుగా కార్మిక క్షేత్రమైన మందమర్రిలో నిర్వహించే ‘ప్రజా ఆశీర్వాద సభ’లో పాల్గొని ప్రసంగించనున్నారు. మంచిర్యాల జిల్లాలో జరిగే తొలి సభ కావడంతో సుమన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని జన సమీకరణ చేస్తున్నారు. జనాన్ని తరలించడానికి 800 ప్రత్యేక బస్సులు, ప్రైవేట్ వాహనాలు ఏర్పాటు చేశారు. దాదాపు 50 వేలకుపైగా జనాన్ని తరలించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా.. బుధవారం కూడా సీఎం కేసీఆర్ కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.
మంచిర్యాల, నవంబర్ 6(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు(మంగళవారం) మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలోని మందమర్రికి రాను న్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించే చెన్నూర్ నియోజకవర్గ ‘ప్రజా ఆశీర్వాద సభ’కు కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మందమర్రి సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో మధ్యా హ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు జరిగే సభ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంచి ర్యాల జిల్లాలో ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న తొలి సభ కావడంతో విప్ బాల్క సుమన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేస్తున్నారు.
నియోజకవర్గ నలుమూలల నుంచి ప్రజలను తీసుకువచ్చేందుకు చర్యలు తీసు కుంటున్నారు. కోటపల్లి, చెన్నూర్ రూరల్, భీమారం, జైపూర్ మండలాల్లో ప్రతి ఒక గ్రామం నుంచి అలాగే చెన్నూర్ టౌన్, రామకృష్ణాపూర్ టౌన్లలో వార్డుల నుంచి తరలివచ్చే వారి కోసం 800 ప్రత్యేక బస్సులు, మరికొన్ని ప్రైవేటు వాహనాలను పురమాయించారు. దాదాపు 50 వేల మంది సభకు తరలించాలనే లక్ష్యంగా పెట్టుకున్నా రు. ఇప్పటికే 40 వేలకు పైగా కుర్చీలను ప్రాంగ ణంలో వేయించారు. సీఎం పర్యటన దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసులు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. సీఎం సభ నేప థ్యంలో సభా ప్రాంగణం చుట్టూ పక్కల ప్రాంతా లన్నీ గులాబీమయమయ్యాయి.
సీఎం కేసీఆర్, చెన్నూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి విప్ బాల్క సుమన్ భారీ కటౌట్లతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బహిరంగ సభకు తరలివచ్చే అశేష జన వాహిని కోసం సభా ప్రాంగణంలో ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్న సమయంలో సభ ఉన్న నేపథ్యంలో వచ్చే వారికి ఇబ్బందులు కలుగ కుండా టెంట్లు వేయించారు. తాగునీటి వసతులు కల్పిస్తున్నారు. ధూంధాం కళాకారుల కోసం సభా వేదిక పక్కనే ప్రత్యేక స్టేజీని వేస్తున్నారు. మంగళ వారం ఉదయం వరకు సభా వేదిక, ప్రాంగణం పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ‘ప్రజా ఆశీర్వాద సభ’ కోసం మధ్యాహ్నం హైదరాబాద్‌లో హెలికాప్టర్లో బయల్దేరి నేరుగా మందమర్రికి చేరుకుంటారు. దాదాపు గంట పాటు ఇక్కడే ఉంటారు. అనంతరం ఇక్కడి నుంచి బయల్దేరి మంథనిలో నిర్వహించే సభకు వెళ్లనున్నారు.
మందమర్రిలో సీఎం కేసీఆర్ సభతోపాటు బుధవారం ఒకే రోజు కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి మూడు నియోజకవర్గాల్లో ప్రజా ఆశీ ర్వాద సభలు ఉండనున్నాయి. రేపు సిర్పూర్లో మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు, ఆసిఫాబాద్‌లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు చివరగా బెల్లంపల్లిలో మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు సీఎం కేసీఆర్ సభలు ఉండనున్నాయి.