దహెగాం, జూన్ 9 : దహెగాం మండలం ఖర్జీ గ్రామ పరిధిలోని లోహ గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయి గిరిజనులు ఇబ్బందులు పడుతుండగా, ఈ నెల 9న ‘నమస్తే తెలంగాణ’ మెయిన్ పేజీలో ‘అంధకారంలో లోహ’ పేరిట కథనం ప్రచురితమైంది. ఇందుకు అధికారులు వెంటనే స్పందించారు. ఏఈ రవీందర్ సిబ్బందితో కలిసి ఆదివారం లోహ గ్రామానికి వెళ్లి పాడైపోయిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను తొలగించి, దాని స్థానంలో మరొకటి ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ‘నమస్తే’చొరవతో సమస్యకు పరిష్కారం లభించడంతో గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.