చెన్నూర్ : ఈనెల 18న చెన్నూర్ పట్టణంలో నిర్వహిస్తున్న సీపీఐ పార్టీ ( CPI Party ) చెన్నూర్ మండల మహా సభలను( Mahasabha ) విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు రేగుంట చంద్రశేఖర్ కోరారు. ఈ మేరకు చెన్నూరులో ఆదివారం మండల మహాసభల పోస్టర్లను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ పార్టీ వంద సంవత్సరాల వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మహాసభను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. శతాబ్దకాలంలో సీపీఐ ప్రజా సమస్యలను అలుపెరగని పోరాటాలు చేసి అనేక విజయాలు సాధించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి మిట్టపల్లి పౌల్, మండల కార్యదర్శి నెన్నల సమ్మయ్య నాయకులు చందు, శంకర్, తిరుపతి పాల్గొన్నారు.