కోటపల్లి, ఏప్రిల్ 22 : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం లో పోలీసు, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బదావత్ సంతోష్, రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ హెచ్చరించారు. సోమవారం రాపనపల్లి సమీపంలోని అంతర్రాష్ట్ర చెక్ పోస్టును వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వారు మాట్లాడుతూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు.
డబ్బు, మద్యం, బంగారం అక్రమంగా తరలిస్తే పట్టుకోవాలని సూచించారు. అనంతరం రిజిస్టర్‌ను పరిశీలించారు. మంచిర్యాల డీసీపీ అశోక్‌కుమార్, ఏసీపీ ప్రకాశ్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, శ్రీరాంపూర్ సీఐ మోహన్, చెన్నూర్ టౌన్ ఇన్స్పెక్టర్ రవీందర్, కోటపల్లి ఎస్ఐ రాజేందర్, భీమారం ఎస్ఐ రాములు, రెవెన్యూ అధికారులు ఉన్నారు.