పైనాపిల్.. సక్సెస్ఫుల్
ఆదిలాబాద్ జిల్లాలో రైతులు ఎక్కువగా పత్తి, సోయాబీన్, కంది, శనగ, గోధుమ, జొన్న పంటలను సాగు చేస్తారు. ఏటా వానకాలంలో జిల్లాలో 5 లక్షల ఎకరాల వరకు పంటల సాగు విస్తీర్ణం ఉంటుండగా, 80 శాతం మంది పత్తినే వేస్తారు. జూన్‌లో వేసిన పంట జనవరి వరకు ఉంటుంది. అధిక వర్షాలు, గులాబీరంగు పురుగు, ఇతర చీడ, పీడల కారణంగా రైతులు
- ఆదిలాబాద్‌లో ప్రయోగాత్మకంగా తోట
- హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్లో పెంపకం
- ఏడాదిన్నరలో చేతికి ఫలాలు
- సత్ఫలితాలనివ్వడంతో విస్తరించేందుకు ప్రణాళిక
- ఆయిల్ పామ్, జామ, అరటి తోటల్లో అంతర పంటగా అవకాశం
- రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు
- లాభదాయకమంటున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు
ఆదిలాబాద్, జనవరి 27 ( నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లాలో రైతులు ఎక్కువగా పత్తి, సోయాబీన్, కంది, శనగ, గోధుమ, జొన్న పంటలను సాగు చేస్తారు. ఏటా వానకాలంలో జిల్లాలో 5 లక్షల ఎకరాల వరకు పంటల సాగు విస్తీర్ణం ఉంటుండగా, 80 శాతం మంది పత్తినే వేస్తారు. జూన్‌లో వేసిన పంట జనవరి వరకు ఉంటుంది. అధిక వర్షాలు, గులాబీరంగు పురుగు, ఇతర చీడ, పీడల కారణంగా రైతులు కొంత నష్టపోవాల్సి వస్తుంది. జిల్లాలో నల్లరేగడి భూములు ఉండగా, వివిధ పంటలు సాగు చేసుకునేందుకు అవకాశం ఉంది. జిల్లా రైతులకు ఎక్కువ ఆదాయం వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం వివిధ పంటలు వేయించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఇందులో భాగంగా ఆయిల్‌పామ్, ఇతర పండ్లతోటల పెంపకానికి ప్రోత్సాహం అందిస్తున్నది. సర్కారు అందిస్తున్న సాయంతో రైతులు జిల్లాలో ఇప్పటికే మామిడి, సీతాఫలం, జామ, అరటి, ఆపిల్ బేర్, డ్రాగన్ ఫ్రూట్, బొప్పాయి పంటలను సాగు చేస్తున్నారు. ఇప్పడు పైనాపిల్ సాగుకు జిల్లాలో అనుకూలమైన వాతావరణం, భూములు ఉన్నాయని అధికారులు నిర్ధారించారు.
హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్లో సాగు
ఆదిలాబాద్‌లో శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ పరిశోధనా కేంద్రంలో శాస్త్రవేత్తలు ఈ ఏడాది పైనాపిల్‌ను తోటను ప్రయోగాత్మకంగా పెంచా రు. ఈ పంట తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సాగవుతుంది. కాగా, హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్లో కేరళ నుంచి అమృత, మారిషస్ రకాలకు చెందిన 300 మొక్కలను తెచ్చి పెంచారు. మొక్కల పెరుగుదలకు అనుకూలమైన వాతావరణం కల్పించడంతో పాటు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో ఏడాదిన్నరలోనే ఏపుగా పెరిగి కా యలు కాసి పండ్లుగా మారాయి. దీంతో జిల్లాలోని వా తావరణం, భూములు పైనాపిల్ తోటలకు అనుకూలమ ని అధికారులు తేల్చారు.
ఆయిల్‌పామ్‌తో పాటు వివిధ పండ్ల తోటల్లో అంతరంగా సా గు చేసుకోవచ్చని ఉద్యానవన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జిల్లాలో ఆయిల్ పామ్ తోటల సాగును ప్రభుత్వం ఇప్పటికే ప్రోత్సహిస్తు న్నది. ఈ ఏడాది 3400 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోట ల పెంపకానికి అధికారులు ప్రణాళికలు తయారు చేశా రు. వీటితో పాటు జిల్లాలో ఇప్పటికే జామ, అరటి, బొ ప్పాయి తోటలు ఉన్నాయి. వీటిలో పైనాపిల్‌ను అంతర పంటగా సాగు చేయవచ్చు. ఈ తోటల పెంపకం లాభదాయకంగా ఉంటుందని మొదటి దిగుబడి 18 నెలలు పడుతుందని, తర్వాత కాల వ్యవధి బాగా తగ్గుతుందని ఉద్యానవన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పెంపకంలో రై తులకు అవసరమైన శిక్షణ కూడా ఇస్తామని తెలిపారు.
పైనాపిల్.. లాభదాయకం
పైనాపిల్ తోట రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఆదిలాబాద్ హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్లో ప్రయోగాత్మంగా చేపట్టిన తోటల పెంపకం విజయవంతమైంది. ఆయిల్‌పామ్, జామ, బొప్పాయి తోటల్లో ఈ చెట్లు పెంచుకోవచ్చు. ఒక్కో మొక్కను 50 సెంటీ మీటర్ల దూరంలో నాటాల్సి ఉంటుంది. పాక్షికంగా నీడ ఉండాలి. ఎకరానికి 16 వేల మొక్కలు నాటే అవకాశం ఉంది. పైనాపిల్ తోటల పెంపకంపై అవసరమైతే రైతులకు అవగాహన కల్పిస్తాం. . – డాక్టర్ సుచిత్ర, సీనియర్ సైంటిస్ట్, ఉద్యాన పరిశోధనా స్థానం, ఆదిలాబాద్
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

