దస్తూరాబాద్ : ప్రజలకు అందుబాటులో ఉండి, కార్యాలయానికి వచ్చే వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తహసీల్దార్( Tehsildar ) బత్తుల విశ్వంబర్( Battula Viswamber ) అన్నారు. దస్తూరాబాద్ మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో సోమవారం కార్యాలయ అధికారులతో, సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్టిఫికెట్ల జారీలో జాప్యం ఉండవద్దని సూచించారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రేషన్ కార్టుల వెరిఫికేషన్లు ఎప్పటికప్పుడు చేయాలని అన్నారు. అంతకుముందు పలు గ్రామాల్లో పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. లారీల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని. వరి కొనుగోళ్లను వేగవంతం చేయాలని నిర్వహకులను ఆదేశించారు. ఆయన వెంట డిప్యూటీ తహసీల్దార్ యాదవ రావు, సీనియర్ అసిస్టెంట్ సంతోష్, ఆర్ఐ లు రచన, కార్యాలయ సిబ్బంది, రైతులు,తదితరులు పాల్గొన్నారు.