ఉట్నూర్ రూరల్, సెస్టెంబర్ 4 : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రలోని సామాజిక దవాఖానలో గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు కరెంటు సరఫరాలో అంతరాయం కలిగింది. గణేశ్ నిమజ్జనం సందర్భంగా విద్యుత్ అధికారులు మరమ్మతులు చేస్తుండడంతో దాదాపు ఐదు గంటలపాటు విద్యుత్‌ను నిలిపివేశారు.
దీంతో దవాఖాన అంధకారంగా మారడంతో రోగులు అవస్థలు పడ్డారు. లక్షలు వెచ్చించి జనరేటర్ కొనుగోలు చేసినా.. దానికి మరమ్మతులు చేపట్టకపోవడంతో నిరుపయోగంగా మారింది. జనరేటర్‌కు మరమ్మతులు చేయించాలని అధికారులను కోరుతున్నారు.