ఇచ్చోడ, జూన్ 25 : ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒకసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఇచ్చోడ మండలంలోని డోంగర్గావ్ సమీపంలోకి రాగానే ఇంజిన్ నుంచి పొగలు వచ్చాయి. గమనించిన డ్రైవర్ బస్సును రోడ్డు పకన నిలిపివేశాడు. ప్రయాణికులు హుటాహుటిన కిందకు పరుగులు తీశారు. సకాలంలో డ్రైవర్ స్పందించడంతో ఎవరికీ ప్రమాదం జరగలేదు.