రుణ మాఫీ : రూ. 37 వేల నుంచి రూ. 41 వేల వరకు..
రైతులు : 62,758 మంది
జమ చేసిన నగదు : రూ. 237.85 కోట్లు
రుణ మాఫీ : రూ. 41 వేల నుంచి రూ. 43 వేల వరకు..
రైతులు : 31,339 మంది
జమ చేసిన నగదు : రూ. 126 కోట్లు
భూ తల్లినే నమ్ముకొని జీవిస్తున్న అన్నదాతలకు మరో శుభత‘రుణం’ వచ్చేసింది. రూ. లక్ష లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన 24 గంటల్లోనే ప్రక్రియ ఊపందుకున్నది. మొదటి రోజు రూ. 37 వేల నుంచి రూ. 41 వేల వరకు రుణాలు మాఫీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 62,758 మందికి రూ. 237.85 కోట్లు చెల్లించింది. ఇక రెండో రోజు రూ. 41 వేల నుంచి రూ. 43 వేల వరకు మాఫీ చేయగా, 31,339 మందికి రూ.126 కోట్లు జమ చేసింది. బ్యాంకు ఖాతాల్లో నగదు పడుతుండగా, రైతాంగం తమ సెల్ఫోన్లకు వస్తున్న మెస్సేజ్‌లు చూస్తూ మురిసిపోతున్నది. ఈ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తూ దీవెనలందిస్తున్నది. లెక్కకు మించి పథకాలు అమలు చేస్తూ సాగు దండుగ కాదు.. పండుగ అని నిరూపించిన బీఆర్ఎస్ సర్కారుకు జీవితాంతం రుణపడి ఉంటామని స్పష్టం చేస్తున్నది.
– మంచిర్యాల, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
దిలావర్పూర్, ఆగస్టు 4 : ఒకప్పుడు నీళ్లు, కరెంట్ లేక పంటలు వేసేందుకు భయపడేటోళ్లం. అప్పో.. సప్పో తెచ్చి ఎవుసం చేసినా లాభముండేది కాదు. వచ్చే సొమ్మంతా షావుకార్లకే అయ్యేవి. తెలంగాణ వచ్చినంక మా బతుకులు మారిపోయినయ్. కేసీఆర్ సీఎం అయినంక మాకు మస్తు భరోసా వచ్చింది. ఉచితంగా 24 గంటల పాటు కరెంట్ ఇస్తన్రు. మిషన్ కాకతీయ కింద చెరువులను మంచిగ చేయించిన్రు. రైతు బంధు కింద పెట్టుబడి సాయం కూడా ఇస్తన్రు. ఒకవేళ జరుగరానిది జరిగితే రైతు బీమాతో సాయం చేస్తండు. గిసొంటి సీఎంను ఇంత వరకు సూడలే. ఇప్పుడు రంది లేకుంట పంటలు వేసుకొని హాయిగా బతుకుతున్నం. నేను దిలావర్పూర్ గ్రామీణ బ్యాంకులో రూ.39 వేల పంట రుణం తీసుకున్న. శుక్రవారం నా ఖాతాలో డబ్బులు పడ్డయ్. మస్తు సంబురమైంది. బతికున్నంత కాలం సీఎం కేసీఆర్ సార్‌ను తలుసుకుంట
– బండిశీల గంగన్న, రైతు, కంజర్
మంచిర్యాల, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారమే రూ. లక్ష లోపు పంట రుణాలు మాఫీ చేస్తుండగా, రైతుల్లో సంబురం అంబరాన్నంటుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలిచ్చిన 24 గంటల్లోనే రుణమాఫీ ప్రక్రియ ఊపందుకున్నది. మొదటి రోజు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 62,758 మందికి రూ.37 వేల నుంచి రూ.41 వేల వరకు రుణాలు మాఫీ అయ్యాయి. ప్రభుత్వం మొత్తం రూ. 237.85 కోట్లు చెల్లించింది. ఇక రెండో రోజు శుక్రవారం 31,339 మందికి రూ. 41 వేల నుంచి రూ.43 వేల వరకు రుణాలు మాఫీ అయ్యాయి. ప్రభుత్వం రూ. 126 కోట్లు మాఫీ చేసింది. చాలా మంది రైతులు పాస్బుక్ల కోసం, రెన్యువల్ కోసం బ్యాంకులకు వెళ్లడం కనిపించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2.98 లక్షల మంది రుణాలు తీసుకున్న రైతులు ఉన్నారు. ఇందులో రూ.25 వేలలోపు తీసుకున్న రుణాలు పూర్తిస్థాయిలో మాఫీ అయ్యాయి. దీని ద్వారా 30,229 మంది లబ్ధిపొందారు. రెండో విడుతలో రూ.50వేల లోపు రుణాలు తీసుకున్న 24 వేల మందికి లబ్ధిచేకూరింది. తాజా రుణమాఫీతో రూ.లక్ష వరకు రుణాలు మాఫీ కానుండగా, దాదాపు రైతులందరికీ ఇది వర్తించనున్నది.
కోటపల్లి, ఆగస్టు 4 : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీపై చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఈ మేరకు శుక్రవారం ఉ మ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు సం బురాలు చేశారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశా రు. మిఠాయిలు పంచి.. పటాకులు కాల్చారు. కోటపల్లి మండలం షట్‌పల్లిలో చెన్నూర్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముల్కల్ల శశిపాల్ రెడ్డి, షట్పల్లి సర్పంచ్ ముల్కల్ల ఉమ, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. ఉప సర్పంచ్ గోనె మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్‌లు పుప్పిరెడ్డి రాంరెడ్డి, వేముల రాజం, నాయకులు చల్ల రమేశ్ రెడ్డి, పుప్పాల సతీశ్, సుదాకర్ నాయకులు పాల్గొన్నారు. జనగామలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎంపీటీసీ మారిశెట్టి తిరుపతి ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. మాజీ ఎంపీపీ దుర్గం వెంకటస్వామి, మాజీ సర్పంచ్ భూతం కిష్టయ్య, నాయకులు కడార్ల రాజన్న, కొడిశెట్టి సంతోష్, సల్పాల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
దహెగాం/పెంచికల్పేట్,ఆగస్టు 4 : మండల కేంద్రంలో జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు రైతులు, నాయకులతో కలిసి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. పెంచికల్పేట్ మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు నాయకులు, సర్పంచులు, ప్రజలతో కలిసి సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తాళ్లపల్లి శ్రీరామరావు, మర్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్, రైతుబంధు మండల కన్వీనర్ కంబగౌని సంతోష్‌గౌడ్, వైస్ ఎంపీపీ చౌదరి సురేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రసాద్‌రాజు, కాగజ్‌నగర్ మారెట్ కమి టీ చైర్మన్ కాసం శ్రీనివాస్, సర్పంచులు జాజిమొగ్గ శ్రీనివాస్, సుధాకర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తిరుపతి, నాయకులు పుప్పాల సంతోష్, హట్కరి మధూకర్,పుప్పాల శ్రీనివాస్, పాపయ్య,కోండ్ర మహేశ్‌గౌడ్, శ్రీనివాస్,రాచకొండ,రాజు, ముంతాజ్,సదాశివ్, రామచందర్, ఎసే బాబు, రాజేశ్వర్,నజీర్ ఉన్నారు.
నర్సాపూర్ (జీ)ఆగస్టు 4 : మండల కేంద్రంలో సీఎం కేసీఆర్, మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చిత్రపటాలకు, నాయకులు, రైతులు పాలాభిషేకం చేశారు, బీఆర్ఎస్ మండల కన్వీనర్ గోపిడి గంగారెడ్డి, జడ్పీటీసీ చిన్న రామయ్య, సర్పంచ్ రాంరెడ్డి, ఆర్బీఎస్ జిల్లా స భ్యుడు కోండ్ర రమేశ్, ఎంపీటీసీలు మల్లేశ్, బర్కుంట గంగారాం, బర్కుంట రాము, మహేందర్, శంకర్, జుబేర్, దోర రాజు, తండా సర్పంచ్‌లు శ్రీనివాస్, జాదవ్ శ్రీను. జుక్కన్న, రాంపూర్ యూత్ లీడర్ ప్రవీణ్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నవీన్,జీవన్ రావ్, టెంబూరి ్ణమాజీ సర్పంచ్ గంగారాం, పిట్ల సాయన్న పాల్గొన్నారు.
నార్నూర్, ఆగస్టు 4 : మండల కేంద్రంలో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ బీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎంపీపీ కనక మోతుబాయి, డిప్యూటీ తహసీల్దార్ అమృత్లాల్, సర్పంచ్ బానోత్ గజానంద్ నాయక్, పీఎస్సీఎస్ ఇన్చార్జి చైర్మన్ ఆడే సురేశ్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తొడసం నాగోరావు, కో ఆప్షన్ సభ్యుడు షేక్ దస్తగిరి, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు ఉర్వెత రూప్‌దేవ్, డైరెక్టర్ దుర్గే కాంతారావు, నాయకులు కనక ప్రభాకర్, మెస్రం హన్మంత్‌రావు, షేక్ దాదేఅలీ, షేక్ హైమద్, సయ్యద్ ఖాసీం ఉన్నారు.
భైంసా, ఆగస్టు 4 : స్థానిక మార్కెట్ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్‌బాబు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జేకే పటేల్, డైరెక్టర్ రాము, సిరాజ్, నాయకులు ఉన్నారు.
భైంసాటౌన్, ఆగస్టు 4 : వానల్‌పాడ్‌లో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి రైతులు, బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూమారెడ్డి, ఉప సర్పంచ్ దగ్డే ఈశ్వర్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ చాకేటి లస్మన్న, సర్పంచ్ మాన్కుర్ పెద్ద రాజన్న, నాయకులు గణేశ్పాటిల్,రాంకుమార్, ముత్యం రెడ్డి పాల్గొన్నారు.
కుభీర్, ఆగస్టు 4 : పార్డి(బీ)లో బీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూం రాజేశ్వర్ ఆధ్వర్యంలో రైతులు, నాయకులు, కార్యకర్తలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు. రైతుబంధు సమితి అధ్యక్షుడు శేరి సురేశ్, ఉప సర్పంచ్ తుకారాం, బంతి మహేశ్, బెల్లాల గంగయ్య పాల్గొన్నారు. కుభీర్‌లోని అన్నబావుసాటే చౌక్‌లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎన్నీల అనిల్ ఆధ్వర్యంలో రైతులు, నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మండలకేంద్రం కుభీర్‌లోని అన్నబావుసాటే చౌక్‌లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎన్నీల అనిల్ రైతులతో కలిసి సీఎం చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. గద్దెపై పార్టీ జెండాను అనిల్ ఆవిష్కరించారు. నాయకులు, రైతులు కేసీఆర్ జిందాబాద్, వందేళ్లు వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. కుప్టి గ్రామంలోనూ సీఎం చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. సర్పంచ్ పానాజీ మీరా విజయ్, వైస్ ఎంపీపీ మొహియొద్దీన్, మార్కెట్ కమిటీ చైర్మెన్ కందూరి సంతోష్, డాక్టర్ పెంటాజీ, దొంతుల లింగన్న, సిద్దంవార్ వివేకానంద, మాజీ సర్పంచ్ బాబు, రైతుబంధు అధ్యక్షుడు పీరాజీ, బొప్ప నాగలింగం, బడా సాయినాథ్, ధర్మకిరణ్, మల్లేశ్, దత్తాత్రి, గోనే కళ్యాణ్, గిరి పోశెట్టి, ఎస్.రవి, సందీప్ దుగ్గే పాల్గొన్నారు.
కుంటాల, ఆగస్టు, 5: మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ పడకంటి దత్తు బీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. డీసీసీబీ డైరెక్టర్ తూర్పాటి వెంకటేశ్, రైతుబంధు సమితి అధ్యక్షుడు శంకర్ గౌడ్, ఎంపీటీసీ మధు, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, జాగృతి మండలాధ్యక్షుడు బోగ లక్ష్మణ్, పీఏసీఎస్ చైర్మన్ సట్లగజ్జారాం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొంతల పోశెట్టి, ప్యాక్స్ డైరెక్టర్ గజ్జారాం, సర్పంచ్ మల్లేశ్, నాయకులు బుచ్చన్న, అశోక్ రెడ్డి, రమణ గౌడ్, వెంకటేశ్, సదాశివ్పటేల్, అనిల్, మల్లేశ్‌గౌడ్, రజనీకాంత్, శ్రీనివాస్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భోజన్న, సుదర్శన్ రెడ్డి, జుట్టు మహేందర్, చౌహన్ రాజు, సబ్బిడి గజేందర్, రాజేందర్ ఉన్నారు.
కడెం, ఆగస్టు 4: మాసాయిపేటలో సర్పంచ్ రాముగౌడ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతు సంఘం గ్రామ కమిటీ అధ్యక్షుడు నర్సయ్య, రైతులు రాజేశ్వర్, పోచన్న, గంగన్న, శ్రీనివాస్, శంకర్, హైమద్, సామాజిక కార్యకర్త ప్రసాద్‌గౌడ్ ఉన్నారు.
తలమడుగు, ఆగస్టు 4 : మండల కేంద్రంలో బీఆర్ఎస్ రైతు విభాగం నాయకులు శ్రీనివాస్ రెడ్డి, నాయకులు, రైతులతోకలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతులు కట్కం దేవన్న, స్వామి, ఉశన్న, షర్పోద్దీన్ పాల్గొన్నారు.
జైనథ్, ఆగస్టు 4 : మేడిగూడలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే జోగు రామన్న చిత్రపటానికి రైతులు, నాయకులు పాలాభిషేకం చేశారు. పటాకులు కాల్చి.. మిఠాయిలు పంపిణీ చేశారు.
తాంసి, ఆగస్టు 4 : నాకు రెండెకురాలున్నది. మా నాన్న నుంచి వచ్చిన భూమిని సాగు చేసుకుంటున్న. 99 వేలు రుణం తీసుకున్న. ఇప్పుడు సీఎం కేసీఆర్ సార్ మాఫీ చేస్తమని చెప్పిన్రు. చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ రాకముందు ఎవుసం ఆగమాగం ఉండేది. రైతు అంటేనే ఈసడించుకున్నరు. సాగునీరు, కరెంటు, ఎరువుల కోసం పడ్డ బాధలు చెప్పరాదు. మళ్లా పంటల దిక్కు చూడద్దని అనుకున్నం. ఉన్న భూమి అమ్ముకొని ఎక్కడున్నా బతుకు దెరువు చూసుకోవాలనిపించింది. కానీ, తెలంగాణ వచ్చినంక ఎవుసం మంచిగైంది. కేసీఆర్‌ను నమ్మి వెంట నడిచినం బాగుపడ్డం. ఆయన జెయ్యవట్టి మా రైతులు మంచిగున్నరు. ఆయనకే మళ్లీ పట్టం కడ్తం.
– ఈదపు సురేఖ, మహిళా రైతు, పొన్నారి
తాంసి, ఆగస్టు 4 : సీఎం కేసీఆర్ సారు మా రైతులు అడుగకముందే అన్నీ చేస్తుండు. గతంలో ఎవరూ ఇలా చెయ్యలే. రైతు బీమాతో భారోసా ఇచ్చాడు. ఏడాదిలో రెండు పంటలకు పెట్టుబడి సాయం ఇస్తుండు. దేశంలో ఎక్కడైనా ఉందా ఇట్ట..? తెలంగాణలో రైతుల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్. అందుకే ఎవరికీ సాధ్యం కాని పథకాలు తెస్తుండు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తున్నడు. ఇంతకంటే మా రైతులకు ఏం కావాలి. కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటాం.
– తొగరి భూమన్న, రైతు పొన్నారి
కడెం, ఆగస్టు 4 : నాకు ఎకరం వ్యవసాయ భూమిఉంది. దానికి సంబంధించి మండలంలోని లింగాపూర్ ఎస్బీఐ బ్యాంక్‌లో 2018లోనే 50 వేల పంట రుణం తీసుకున్న. అవి నా వ్యవసాయ పెట్టుబడులకు ఎంతగానో ఉపయోగపడ్డయ్. తెలంగాణ సర్కారు ఇప్పుడు రుణమాఫీ చేసింది. అందులో నా పంట రుణం కూడా మాఫీ అయ్యింది. రైతు రుణమాఫీ అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న బృహత్తరమైన నిర్ణయం.
– జడ ఇందూర్ నేత, రైతు, కొత్తమద్దిపడగ
కడెం, ఆగస్టు 4 : నేను కూడా 38 వేల పంట రుణం తీసుకున్న. సీఎం కేసీఆర్ సారు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ ప్రకటించారు. దీంతో నా మొబైల్‌కు ప్రభుత్వం నుంచి మెస్సేజ్ వచ్చింది. నేను తీసుకున్న రుణం మాపీ అయ్యిందని, ఇక మీ రుణం చెల్లించాల్సిన అవసరం లేదని అందులో ఉన్నది. రైతుల పరిస్థితిని అర్థం చేసుకొని ఏకకాలంలో రుణం మాఫీ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు.
– తోట రాజేశ్వర్, రైతు, పెద్దబెల్లాల్
సిర్పూర్(టీ), ఆగస్టు 4 : తెలంగాణ వచ్చిన తర్వాతనే మా బతుకులు బాగుపడ్డయ్. రాష్ట్రంలో రైతు ప్రభుత్వం ఉన్నది. సీఎం కేసీఆర్ సారు రైతులకు ఏది కావాలో అది చేస్తున్నడు. ఒక మూలన ఉన్న ఎవుసం బాగు చేసిండు. సాగునీరు కరెంటుకు గోస లేకుండా చేసిండు. ఎక్కడా లేనివిధంగా పంట పెట్టుబడి, రైతు బీమా అమలు చేస్తుండు. టైంకు విత్తనాలు, ఎరువులు ఇస్తుండు. 2014 నుంచి ఇప్పటి వరకు రెండుసార్లు పంట రుణమాఫీ చేసిండు. అప్పటి ప్రభుత్వాలు రైతుల కోసం ఒక్క పనీ చెయ్యలే. మేమంతా కేసీఆర్ సార్‌ను నమ్ముతున్నం.
– చౌదరి నానాజీ, పారిగాం, మండలాధ్యక్షుడు, రైతు బంధు సమితి, సిర్పూర్(టీ)
కుంటాల, ఆగస్టు 4 : నాకు కుంటాల తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో రుణం ఉంది. 2017లోనే తీసుకున్న. ప్రతీ సంవత్సరం రెన్యూవల్ చేసుకుంటా వస్తున్న. అయితే ఎన్నికలప్పుడు సీఎం కేసీఆర్ సారు చెప్పినట్టుగానే రుణమాఫీ చేసిన్రు. శుక్రవారం నాకు బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చింది. బ్యాంక్‌కు వచ్చి చూసుకున్న. రుణం మాఫీ అయ్యిందని అధికారులు చెప్పిన్రు. మళ్లీ నేను రుణం తీసుకుంట. వాటితో పంట పొలాన్ని బాగుచేసుకుంట.
– ప్యాదరి చిన్నయ్య, కుంటాల
సిర్పూర్(టీ), ఆగస్టు 4 : సీఎం కేసీఆర్ సారు మా రైతులు అడుగకముందే అన్నీ చేస్తున్నడు. గతంల ఎవరూ ఇట్ల చెయ్యలే. ఏడాదిలో రెండు పంటలకు పెట్టుబడి సాయం ఇస్తండు. రైతు బీమాతో రైతులకు భరోసా ఇస్తున్నడు. తెలంగాణలో రైతుల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి కేసీఆర్ సారు. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తుండు. ఇంతకంటే మా రైతులకు ఏం కావాలి.
– సాన ఊశన్న, రైతు, సిర్పూర్(టీ)