ఎదులాపురం, ఫిబ్రవరి17: రాష్ట్రంలోని 9 మెడికల్ కళాశాలలు, వైద్యశాలల్లో వివిధ కేటగిరీల్లో 765 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్ రిమ్స్‌లో వివిధ కేటగిరీల్లో 70 పోస్టులు మంజూరయ్యాయి. ఇందులో అసిస్టెంట్ ప్రొఫెసర్ (జనరల్ మెడిసిన్)-10, అసిస్టెంట్ ప్రొఫెసర్( జనరల్ సర్జరీ)-10, అసిస్టెంట్ ప్రొఫెసర్(ఓబీజీ)-10, అసిస్టెంట్ ప్రొఫెసర్ (పీడియాట్రిక్స్)-10, అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఆర్థోపెడిక్స్)-10, అసిస్టెంట్ ప్రొఫెసర్(అనస్థీషియా)-10, సివిల్ అసిస్టెంట్ సర్జన్ విభాగంలో10 పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నారు. దీంతో జిల్లా ప్రజలకు మరింత వైద్య సేవలు చేరువకానున్నాయి.