ఇచ్చోడ, ఫిబ్రవరి 17 : తెలంగాణ కల సాకారం చేసిన ఉద్యమ యోధుడు, అపర భగీరథుడు సీఎం కేసీఆర్ ప్రజల ఆకాంక్షను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఎవెన్యూ పార్కులో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేసీఆర్ ఫొటోతో ప్రత్యేకంగా తయారు చేయించిన కేక్‌ను ఎమ్మెల్యే కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు తినిపించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి, ఎంపీపీ నిమ్మల ప్రీతమ్ రెడ్డి, మాజీఎంపీపీ సుభాష్ పాటిల్, సర్పంచ్ చౌహాన్ సునీత, ఉపసర్పంచ్ లోక శిరీశ్ రెడ్డి, ఆత్మచైర్మన్ నరాల రవీందర్, నాయకులు భాస్కర్, దేవానంద్, ఆర్గుల గణేశ్, ముస్కు గంగారెడ్డి, ప్రవీణ్, రాథోడ్ ప్రకాశ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
తాంసి, ఫిబ్రవరి 17 : మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేశారు. అనంతరం రామాలయంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రాజు, ఎంపీపీ మంజుల శ్రీధర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ అరుణ్‌కుమార్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, సర్పంచ్ స్వప్న రత్నప్రకాశ్, నాయకులు పాల్గొన్నారు. పొన్నారి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు కేక్ కట్ చేశారు. టీఆర్ఎస్ నాయకులు విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, చాక్లెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ రమణ, ఎంపీటీసీ రేఖ, మాజీ ఎంపీటీసీ విలాస్, పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు రమేశ్, నాయకులు రఘు, దేవేందర్, చంద్రన్న, గడుగు గంగన్న, ఆశన్న, అశోక్, రామన్న, నారాయణ పాల్గొన్నారు.
గుడిహత్నూర్, ఫిబ్రవరి 17: సీఎం కేసీఆర్ కారణ జన్ముడు అని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో నిర్వహించిన సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరాడే బ్రహ్మానందం, కో ఆప్షన్ సభ్యుడు షేక్ జమీర్, మాజీ ఎంపీపీ సత్యరాజ్, మాజీ ఎంపీటీసీ వినోద్, నాయకులు జాదవ్ రమేశ్, రాథోడ్ ప్రతాప్, జ్యోతి, దిలీప్ పాల్గొన్నారు.
భీంపూర్, ఫిబ్రవరి 17 : మండల కేంద్రంలోని పీహెచ్సీలోజడ్పీటీసీ కుమ్ర సుధాకర్ కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. బాలింతలకు కేసీఆర్ కిట్లు అందజేశారు. కార్యక్రమంలో వైద్యాధికారి విజయసారథి, సిబ్బంది, ఎంపీపీ రత్నప్రభ, వైస్‌ఎంపీపీ గడ్డం లస్మన్న, టీఆర్ఎస్ మండల కన్వీనర్ మేకల నాగయ్యయాదవ్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు అనిల్, సర్పంచ్‌లు లింబాజీ, కృష్ణయాదవ్, బక్కి అజయ్‌యాదవ్, నాయకులు కపిల్యాదవ్, నరేందర్‌యాదవ్, నరేందర్‌రెడ్డి, పాండురంగ్, పురుషోత్తం పాల్గొన్నారు.
బోథ్, ఫిబ్రవరి 17: సంక్షేమ పథకాల అమలులో సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారని ఎంపీపీ తుల శ్రీనివాస్ అన్నారు. కన్గుట్ట గ్రామంలోని బృహత్ పల్లె ప్రకృతి వనంలో సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని గీయించారు. మొక్కలు నాటిన అనంతరం కేక్ కట్ చేశారు. అంతకుముందు సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో బోథ్ సొసైటీ చైర్మన్ కదం ప్రశాంత్, వైస్‌ఎంపీపీ రాథోడ్ లింబాజీ, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, సర్పంచ్ శ్యామల, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే కన్గుట్ట గ్రామంలో వృద్ధురాలు కేక్ కట్ చేసి సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
బోథ్ మండలంలోని కరత్వాడ ప్రాజెక్టులో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో కేసీఆర్ బర్త్ డే వేడుకలు నిర్వహించారు. గత పాలకులు గంగ పుత్రులను ఏనాడు పట్టించుకోలేదని, కేసీఆర్ మిషన్ కాకతీయతో చెరువులు, ప్రాజెక్టుల పూడికతీత, కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేసి జీవనోపాధి కల్పించిన మహనీయుడని కొనియాడారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు పందిరి పోశెట్టి, శంకర్, భూమన్న, గణేశ్, సురేశ్, అశోక్, స్వామి, నారాయణ, దత్తు, గంగారాం పాల్గొన్నారు.
బోథ్, ఫిబ్రవరి 17 : రఘునాథ్‌పూర్ గ్రామ సమీపంలోని అడెల్లి రోడ్డు వద్ద ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో అందూర్ సర్పంచ్ అంగూరిబాయి, ధన్నూర్(బీ) ఎంపీటీసీ నారాయణరెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ రుక్మాణ్‌సింగ్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చోడ, ఫిబ్రవరి 17: దళిత బాంధవుడు సీఎం కేసీఆర్ అని ముక్రా(కే) సర్పంచ్ మీనాక్షి అన్నారు. ముక్రా(కే)లోని 30 మంది దళితులకు ప్రభుత్వం ఒక్కొక్కరికి మూడెకరాల చొప్పున 90 ఎకరాలు పంపిణీ చేసింది. దీంతో గ్రామంలోని దళిత కుటుంబ సభ్యులు తమ పంట పొలాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గ్రామంలోని శివాలయంలో హోమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సుభాష్, ఉపసర్పంచ్ వర్షతాయి, నాయకులు సంజీవ్, తిరుపతి, సంతోష్, జ్ఞానేశ్వర్, బాలాజీ, దీపక్ పాల్గొన్నారు.
ఇచ్చోడలోని మైనార్టీ బాలుర గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం, కేసీఆర్ అక్షర క్రమంలో కూర్చున్నారు. ఆటల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ చౌహాన్ సునీత, నాయకుడు మేరాజ్ అహ్మద్, కళాశాల ప్రిన్సిపాల్ రజని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నేరడిగొండ, ఫిబ్రవరి 17 : మండల కేంద్రంలో జడ్పీటీసీ జాదవ్ అనిల్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో ఎంపీపీ రాథోడ్ సజన్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ అల్లూరి శివారెడ్డి, ఏఎంసీ చైర్మన్ భోజన్న, వైస్‌ఎంపీపీ మహేందర్ రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ సాబ్లే నానక్‌సింగ్, వీడీసీ చైర్మన్ రవీందర్‌రెడ్డి, సీనియర్ నాయకులు సయ్యద్ జహీర్, చంద్రశేఖర్‌యాదవ్, బుగ్గారం(కే) సర్పంచ్ సుభాష్, ఉపసర్పంచ్ దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
బజార్హత్నూర్, ఫిబ్రవరి 17 : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ లావణ్య, టీఆర్ఎస్ మండల కన్వీనర్ రాజారాం, నాయకులు శేఖర్, మధుకర్, రమణ, అక్షయ్, శ్రీనివాస్, వినోద్ పాల్గొన్నారు.
సిరికొండ, ఫిబ్రవరి 17 : మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం, గాంధీచౌక్‌లో టీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేశారు. అలాగే ఐకేపీ సిబ్బంది మొక్కలు నాటారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ బాలాజీ, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు అశోక్, మాజీ సర్పంచ్ పెంటన్న, ఉపసర్పంచ్ చిన్న రాజన్న, నాయకులు బషీర్, ఈశ్వర్, సూర్యకాంత్, రాజన్న, శంకర్, మల్లేశ్ పాల్గొన్నారు.
తలమడుగు, ఫిబ్రవరి 17: రుయ్యాడి గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు 50 మంది రైతులను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ తోట వెంకటేశ్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు గోక జీవన్ రెడ్డి, నాయకులు, సర్పంచ్‌లు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.