ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నేరడిగొండలోని రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం(,Road accident) జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని నిర్మల్ వైపు వెళుతున్న కారు ఢీకొంది. ప్రమాదంలో కొత్తూర్ వాసి వెంకటేశ్ అక్కడికక్కడే మృతిచెందగా, అన్వేస్కు స్వల్పంగా గాయపడినట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని హాస్పిటల్‌కు తరలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించి కేసు నమోదు చసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Indus Treaty | కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా.. సింధు జలాల విషయంలో భారత్ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదు
CUET-UG | మే 13 నుంచి సీయూఈటీ యూజీ.. అడ్మిట్‌కార్డులు విడుదల చేసిన ఎన్టీఏ
Ram Charan | మేడమ్ టుస్సాడ్స్ చరిత్రలో తొలిసారి.. రామ్ చరణ్ మైనపు విగ్రహం ఎంత అందంగా ఉంది..!