న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే సీయూఈటీ యూజీ (CUET-UG) అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఈ నెల 13 నుంచి జూన్ 3 వరకు జరుగనున్న ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ పుట్టిన తేదీ, అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డ్ https://cuet.nta.nic.in/ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
కాగా, షెడ్యూల్ ప్రకారం సీయూఈటీ యూజీ ప్రవేశ పరీక్షలు మే 8 నుంచి జూన్ 1 వరకు జరగాల్సి ఉన్నాయి. అయితే భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో షెడ్యూల్లో మార్పులు చేసింది. ఇరుదేశాల మధ్య పరిస్థితులు సద్దుమనగడంతో తాజాగా అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. సీయూఈటీ-యూజీకి ఈ ఏడాది 13.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రవేశపరీక్షను కంప్యూటర్ విధానంలో నిర్వహించనున్నారు.
కాగా, ఇప్పటికే జరిగిన సీయూఈటీ-పీజీ 2025 పరీక్ష ఫలితాలను ఈ నెల 6న ఎన్టీఏ విడుదల చేసింది. మార్చి 13, ఏప్రిల్ 1న దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షను నిర్వహించారు.