ఖానాపూర్ టౌన్, సెప్టెంబర్ 11 : సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ రాష్ట్రం పురోభివృద్ధి చెందుతుందని ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్ అన్నారు. సోమవారం ఊట్నూర్ మండలంలోని లక్కారం గ్రామానికి చెందిన 100 మంది బీజేపీ పార్టీ నాయకులు, యువకులు బీఆర్ఎస్లో చేరడంతో వారికి జాన్సన్ నాయక్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్బంగా అయన మాట్లడుతూ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. మరోసారి సీఎం కేసీఆర్ పాలనను ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ముఖ్యంగా యువతకు ఉపాధి వైపు తీసుకెళ్లేందుకు తనవంతుగా కృషి చేస్తానని హమీ ఇచ్చారు. ఇతర పార్టీల నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని, ఆభివృద్ధి చేసే పార్టీ బీఆర్ఎస్ను ఆదరించాలని యువతకు సూచించారు. కార్యక్రమంలో నాయకులు సిడాం సోనేరావ్, సాదని సురేశ్, గిరి ప్రసాద్, సాయి, బొడ్డు సాయి, పవన్, అనంతుల సందీప్, మరపాక శ్రీకాంత్, వెంకటేశ్, రాకేశ్, యువకులు పాల్గొన్నారు.
దస్తురాబాద్, సెప్టెంబర్ 11 : సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ను మూడోసారి ఆశీర్వదించాలని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్ అన్నారు. దస్తురాబాద్ మండలం మున్యాల్, మున్యాల్తండా, ఎర్రగుంట గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించారు. మున్యాల్లో ఎంపీటీసీ దుర్గం సునీత-రాజలింగు నూతన గృహ ప్రవేశానికి హాజరైన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మున్యాల్ తండాలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన 20 మంది నాయకులు ఆయన సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఎర్రగుంట గ్రామంలో నిర్వహించిన తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. మహిళలు, యువతులతో కలిసి నృత్యాలు చేశారు.
మొదటిసారిగా మండలానికి వచ్చిన జాన్సన్‌నాయక్ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో సన్మానించారు. ఎర్రగుంట గ్రామంలో సేవాలాల్, జగదాంబ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఖానాపూర్ నియోజకవర్గాన్ని ప్రత్యేక ప్రణాళికతో అభివృద్ధి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సింగరి కిషన్, జడ్పీటీసీ సంతపురి శారదాశ్రీనివాస్, మండల అధ్యక్షుడు ముడికె ఐలయ్యయాదవ్, ప్రధాన కార్యదర్శి రాజనర్సయ్య, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు సిర్ప సంతోష్, సర్పంచ్‌లు దుర్గం శంకర్, సురేశ్‌నాయక్, ఎంపీటీసీలు, ఉపసర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.