ఆదిలాబాద్, సెప్టెంబర్ 3(నమస్తే తెలంగా ణ) : ప్రజలను మోసం చేయడంలో కాం గ్రెస్, బీజేపీలు తోడుదొంగలని మాజీ మం త్రి జోగు రామన్న మండిపడ్డారు. మంగళవారం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడారు. మంత్రి శ్రీధర్‌బాబు ప ర్యటన ఆయారాం, గయారాంలా కొనసాగిందని, వరదల కారణంగా నష్టపోయిన పంటలను మంత్రి పరిశీలించలేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలో విఫలమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పర్యటన గురించి ముందు స్తు సమాచారం లేదని, వరదల పరిస్థితిని సమీక్షించడానికి వచ్చిన మంత్రి ఏ ఒక్క గ్రా మాన్ని సందర్శించకుండా, రైతులతో మా ట్లాడకుండా స్థానిక ఎమ్మెల్యే సూచనల మేర కు సీసీఐ సందర్శనకు వెళ్లలేదని తెలిపారు. మంత్రి పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే శంకర్ పంట నష్టం విషయంలో మాట్లాడలేదని ఆయన బీజేపీ ఎమ్మెల్యేగా కాకుండా కాంగ్రె స్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారన్నారు.
సీసీఐని ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు అప్పగించాలని చూస్తున్నదని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. ఇందుకోసం స్థానిక ఎమ్మెల్యే సహకారం అందిస్తున్నారని తెలిపారు. మాజీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సీసీఐని పునఃప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం అ న్ని విధాలుగా సహకరిస్తుందని కోరినా ఫలి తం లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తాను ఎమ్మెల్యేగా సీసీఐని ప్రారంభించాలని కోరినా అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయ ణ ప్రారంభించే ప్రసక్తి లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే కమిషన్ల కోసం సీసీఐ ప్రారంభానికి పావులు కదుపుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభు త్వం పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. బీఆర్ఎస్ నాయకులు రమేశ్, ప్రహ్లాద్, రాజు, రమేశ్, పరమేశ్వర్, అశోక్ స్వామి, మోబీన్, ఆసిఫ్, రాములు పాల్గొన్నారు.