నార్నూర్ : పంచాయతీ ఎన్నికలకు ( Panchayat Elections ) పకడ్బందీగా నామినేషన్లు స్వీకరించాలని అదనపు కలెక్టర్ రాజేశ్వర్ ( Additional Collector Rajeshwar ) అధికారులకు సూచించారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల కేంద్రాన్ని ఎన్నికల పరిశీలన జిల్లా అధికారి వెంకన్నతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యర్థుల నుంచి తీసుకునే నామినేషన్లను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఏవైనా అనుమానాలుంటే వెంటనే ఉన్నతాధికారులను సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పుల్లారావ్, సూపరింటెండెంట్ రాథోడ్ గంగాసింగ్ ఉన్నారు.