నర్సాపూర్ (జి) : విద్యార్థులకు విద్యా బుద్దులు నేర్పే ఓ గురువు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన(Teacher misbehaves) ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్(Nirmal )జిల్లా నర్సాపూర్ (జి) మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. విసిగిపోయిన ఆ విద్యార్థిని తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది.
విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి సదరు ఉపాధ్యాయుడిని నిలదీసి దేహ శుద్ధి చేసినట్లు సమాచారం. అనంతరం ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని బాలిక తల్లిదండ్రులు హెచ్చరించి వెళ్లారు. కాగా, విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సదరు ఉపాధ్యాయుడిని విధుల నుండి తొలగించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉపాధ్యాయుడి పై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని డీఈఓ ను పలువురు కోరారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | బిల్డర్ వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య కాంగ్రెస్ ప్రభుత్వం హత్యే : హరీశ్‌రావు
Komuravelli | మూడో వారం అదే జోరు.. మల్లన్న నామస్మరణతో మార్మోగిన కొమురవెల్లి
RS Praveen Kumar | సీఎం రేవంత్ రెడ్డికి.. ఆ రోగుల లక్షణాలు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
MLC Kavitha | జనగణన ఇంకెప్పుడు చేస్తారు..? కేంద్రాన్ని నిలదీసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత