మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేయండి..
రాష్ట్ర దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి

దిలావర్పూర్ : రైతులు మార్కెట్ డిమాండ్ బట్టి పంటలను సాగు చేసి ఆర్థికంగా బలోపేతం కావాలని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవిశాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన దిలావర్పూర్లో బన్సపల్లీ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయలక్ష్మితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతును రాజు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తూ రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. రైతులు పంటలను ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.
మొదటి రకం ధాన్యానికి మద్దతుధర రూ.1960, రెండవ రకానికి రూ.1940 గా సర్కారు నిర్ణయించింని వివరించారు. రైతులు ఒకే రకమైన పంటలను సాగు చేయకుండా, వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు భూసార పరీక్షలు చేయించి , పంటల మార్పిడి పద్ధతిని అవలంభించాలని కోరారు. దిలావర్పూర్ గ్రామంలోని పోచమ్మ ఆలయం వద్ద గల కోనేరు నిర్మాణానికి రూ. 25 లక్షలు, ఎల్లమ్మ ఆలయానికి రూ.80 లక్షలు, ఏక్నాథ్ ఆలయానికి రూ. 50లక్షలు త్వరలోనే మంజూరు వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బన్సపల్లీ సహకార సంఘం చైర్మన్ పీవీ రమణారెడ్డి, స్థానిక సర్పంచ్ వీరేశ్‌కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొమ్ముల దేవేందర్‌రెడ్డి, ఎంపీపీ బాబురావు, నిర్మల్ జిల్లా సహకార సంఘం మాజీ అధ్యక్షుడు రాంకిషన్‌రెడ్డి, నిర్మల్ సహకార సంఘం ఉపాధ్యక్షుడు దుప్పి. సాయన్న, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు డాక్టర్ సుభాష్‌రావు, జిల్లా రైతు బందు సమితి సభ్యులు ఏలాల చిన్నరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
- Tags
- agricuture
- demand
- farmers
- marketing
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

