Elections | ఓ వైపు పాఠశాలలో విద్యార్థినీవిద్యార్థులకు హెడ్ బాయ్, హెడ్ గర్ల్ పదవుల కోసం ఎన్నికలు పెట్టి.. మరోవైపు చట్టసభలకు ప్రజాప్రతినిధులకు ఎన్నుకున్నట్టుగా ఎన్నికల పోలింగ్ విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ఎంతోమంది టీచర్లకు స్పూర్తిదాయకంగా నిలుస్తున్నారు కుబీర్ జెడ్పీహెచ్ఎస్ సిబ్బంది.
నిర్మల్ జిల్లా కుభీర్ లోని జెడ్పి హైస్కూల్లో మంగళవారం హెడ్ బాయ్, హెడ్ గర్ల్ ఎన్నిక కోసం పోలింగ్ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ, పోలింగ్, ఈవీఎంపై ఓటింగ్ విధానం, కౌంటింగ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. హెచ్ఎం సట్ల గంగాధర్ పర్యవేక్షణలో మాక్ పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ కొనసాగించారు.
మొత్తం ప్రక్రియను నిజమైన ఎన్నికల లాగే నిర్వహించారు. హెడ్ బాయ్, హెడ్ గర్ల్ పదవులకు 8 మంది విద్యార్థులు నామినేషన్ వేయగా, ఇద్దరి నామినేషన్లను తిరస్కరించారు. మరో ఇద్దరు విత్ డ్రా చేసుకున్నారు. పోటీలో నిలిచిన నలుగురు విద్యార్థులకు గుర్తులు కేటాయించి పోలింగ్ నిర్వహించారు.
పాఠశాల విద్యార్థులంతా ఓటింగ్‌లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. పర్యవేక్షకులుగా బారే శ్రీనివాస్, స్వాతి, వాణి, విజయ్ కుమార్‌లతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Miyapur | మియాపూర్ డిపోలో విషాదం.. గుండెపోటుతో కండక్టర్ మృతి
KTR | రాజ్యాంగంపై, సుప్రీంకోర్టుపై బీజేపీకి ఏమాత్రం గౌరవం లేదు : కేటీఆర్
Powerhouse OST | రజినీకాంత్ ‘కూలీ’ నుంచి ‘పవర్‌హౌస్’ ఓఎస్టీ విడుదల