Kubhir | కంపు కొడుతున్న దవాఖాన పరిసరాలు.. పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం
కుభీర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో స్వచ్ఛత లోపించి పరిసరాలన్నీ కంపు కొడుతున్నాయి.
కుభీర్, నవంబర్ 10 : నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో స్వచ్ఛత లోపించి పరిసరాలన్నీ కంపు కొడుతున్నాయి. దవాఖాన మెయిన్ డోర్ ముందు పిచ్చి మొక్కలు పెరిగి బంజరు దొడ్డిలా దర్శనమిస్తోంది. దవాఖాన ముందు ఏర్పాటు చేసిన బోర్డు వంగి పోయినా పట్టించుకున్న వారు లేరు. దవాఖానకు ప్రతి రోజు వచ్చే రోగులు, నెలకోసారి వచ్చే గర్భిణిలు, బాలింతలు ముక్కుమూసుకుని రావాల్సిన దుస్థితి నెలకొంది. రోగాలకు చికిత్స ఏమోగానీ ప్రజలకు రోగాలు ప్రబలేటట్టు ఉన్నాయని పేర్కొంటున్నారు. దవాఖానలో కనీస సౌకర్యాలు కూడా కరువయ్యాయి.
పేరుకే ‘రౌండ్ ది క్లాక్ హాస్పిటల్’ ఏనాడూ 24 గంటలు సేవలు అందించిన దాఖలాలు లేవనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలో 30 వరకు గిరిజన తండాలు ఉన్నాయి. ఇక్కడ సేవలందక ప్రైవేటు ఆర్ఎంపీ, పీఎంల లను ఆశ్రయించి నష్ట పోతున్నారు. ఇక్కడ ఇద్దరు వైద్యులు, ముగ్గురు స్టాఫ్ నర్సులు, ఉండాల్సి ఉండగా ఒక వైద్యుడు, ఒక మేల్ స్టాఫ్ నర్సు మాత్రమే ఉన్నారు. ప్రభుత్వ దవాఖాన ఉన్నా పేదవారికి కనీస వైద్యం అందక పోవడం పట్ల ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు దృష్టి సారించక పోవడం మండల ప్రజలకు శాపంగా మారింది. జిల్లా కలెక్టర్ దృష్టి సారించి మండలంలోని పేద ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని మండలవాసులు డిమాండ్ చేస్తున్నారు.

Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

