భైంసా : అప్పుల బాధతో మనస్తాపం చెందిన ఒకరు గడ్డెన్న వాగు ప్రాజెక్ట్‌లో ఆత్మహత్య చేసుకున్న సంఘటన భైంసాలో జరిగింది . పోలీసుల కథనం ప్రకారం.. భైంసా మండలం మిర్జాపూర్ గ్రామానికి చెందిన అన్నసరం గంగాధర్ (45) భైంసా పట్టణంలోని భోకర్ చెక్‌పోస్టు సమీపంలో సిమెంటు ఇటుకల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. లాక్డౌన్ నేపథ్యంలో వ్యాపారం సాగక అప్పులు చేశాడు. ఈ క్రమంలో తాగుడికి బానిసగా మారాడు.
ఈ నెల 28న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో అదే రోజు పోలీస్ స్టేషన్లో అదృశ్యం కేసు నమోదు చేశారు. శనివారం గడ్డెన్నవాగు ప్రాజెక్టులో వ్యక్తి మృతదేహం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, కుటుంబీకులకు సమాచారమివ్వగా వారు మృతదేహాన్ని గుర్తించారు. భార్య యమునాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గణేశ్ తెలిపారు.