Nursery | నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం భుత్కూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీని గురువారం మండల పంచాయతీ అధికారి రమేష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొలకెత్తని చోట మళ్ళీ కొత్తగా విత్తనాలు పెట్టాలని సూచించారు. మొలకెత్తిన మొక్కలకు నీరు పోసి పెంచాలని అన్నారు. నర్సరీ నిర్వహణపై నిర్లక్ష్యంగా ఉండొద్దని పేర్కొన్నారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలను సరఫరా చేయాలని నర్సరీ నిర్వాహకులను ఆదేశించారు. మండలంలోని దస్తూరాబాద్, భుత్కూర్ గ్రామ పంచాయతీ కార్యాలయాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిజిస్టర్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని, ఎప్పటికప్పుడు వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది, తదితరులు ఉన్నారు.