మామడ, డిసెంబర్ 22 : సీఎం కేసీఆర్ ప్రతిష్టా త్మకంగా అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ తాగునీటిని అందిస్తామని ఎంపీడీవో మల్లేశం పేర్కొన్నారు. పొన్కల్, పోతారం గ్రామా ల్లో మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీ మర మ్మతు పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యుద్ధ ప్రాతి పదికన పనులను చేపట్టాలని సూచించారు. తాగు నీటి సమస్య పరిష్కారానికి ప్రజా ప్రతినిధులు కృషి చేయాలన్నారు. అలాగే పారిశుధ్యం లోపించ కుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. పంచా యతీ కార్యదర్శి సాయి కృష్ణారెడ్డి ఉన్నారు.
నీటి సరఫరా పరిశీలన
కనకాపూర్, పార్పెల్లి, లక్ష్మణచాంద గ్రామాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరాను మంగళవారం ఎంపీడీవో శేఖర్ ఆధ్వర్యంలో అధికారులు పరిశీలించారు. తాగు నీటి సరఫరాలో ఉన్న ఇబ్బందులపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ ఇంట్రా ఏఈ క్రాంతి కుమార్, టీఆర్ఎస్ జిల్లా కార్యదర్శి అడ్వాల రమేశ్, లక్ష్మణచాంద గ్రామ సర్పంచ్ సురకంటి ముత్యంరెడ్డి పాల్గొ న్నారు. మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలను ఎంపీడీవో శేఖర్ పరిశీలిం చారు. విద్యార్థుల హాజరును అడిగి తెలుసుకున్నారు.
అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం వద్దు
గ్రామాల్లో అభి వృద్ధి పనులపై నిర్లక్ష్యం వహించవద్దని ఎంపీడీవో వెంకటేశ్వర్లు సూచించారు. ఎంపీడీవో కార్యాల యంలో అధికారులు, టీఏలు, పంచాయతీ కార్యద ర్శులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సరీ పనుల ను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ సమా వేశంలో ఎంపీవో అనిల్ కుమార్, టీఏలు వినోద్, గోవింద్, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసి స్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.