నిర్మల్: నిర్మల్ (Nirmal ) జిల్లా కడెం మండలంలో దారుణం చోటుచేసుకున్నది. మంత్రాల నెపంతో ఓ వ్యక్తిని దారుణ హత్యకు గురయ్యాడు. కడెం మండలం ఉడుంపూర్ పంచాయతీ పరిధిలోని గండి గోపాల్‌పూర్‌కు దేశినేని భీమయ్య (55) అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన అన్నదమ్ములు మూతి మల్లేశ్ (23), నరేశ్ (21) కలిసి ఈ నెల 10న రాత్రి హత్య చేశారు. అనంతరం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో అతని మృతదేహాన్ని కాల్చివేశారు.
అయితే బూడిద, కొంత భాగం మిగిలిన ఎముకలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దార్యాప్తులో భాగంగా భీమయ్య మంత్రాలు చేస్తున్నాడనే కారణంతో తామే హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. దీంతో వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.