Basara temple | బాసర : బాసర ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్ పూజారి పై దాడి ఘటనలో ఆ పూజారిని ఎమ్మార్వో ఎదుట బైండోవర్ చేయడం అన్యాయమని రాష్ట్ర బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు అన్నారు. బాసర ఆలయ ప్రధాన అర్చకుడిపై దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేయాలని కోరుతూ బాసర పోలీస్ స్టేషన్లో ఏఎస్పీ అవినాష్ కుమార్, సీఐ మల్లేష్, ఎస్ఐ శ్రావణిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పూజారిపై దాడి చేసిన రామారావుపై చర్యలు తీసుకోకుండా, రామారావు ఫిర్యాదు పై పూజారిపై కేసు నమోదు చేసి ఇరువురిని బైండోవర్ చేయడం ఎంతవరకు న్యాయమని వారు ప్రశ్నించారు.
కులం పేరుతో దుర్భాషలాడిన రామారావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేదంటే దశల వారిగా ఆంధోలన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సంజీవ్ పూజారికి ప్రాణహాని ఉందని, పూజారికి తగిన రక్షణ కల్పించాలని పోలీసు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం నాయకులు శ్రీ దర్శణం వెంకటరమణ శర్మ, టీబీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మోత్కూరి రాము, నాయకులు పవన్, మహిళా నాయకులు గాయత్రి కులకర్ణి , గంటి నగేష్, విరాట్ బోరబట్ల, ప్రవీణ్ శర్మ, కేదార్ శర్మ, రామకృష్ణ శర్మ, ఇతర బ్రాహ్మణ సంఘ నేతలు పాల్గొన్నారు.