నిర్మల్ టౌన్/సారంగాపూర్, డిసెంబర్ 21 : టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి అన్ని విధాలా అండగా నిలుస్తుంటే, జీర్ణించుకోలేని కేంద్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలులో కొర్రీలు పెడుతూ అన్నదాతలను అవస్థలకు గురి చేస్తున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ధ్వజమెత్తారు. షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకం కింద నిర్మల్, మామడ, లక్ష్మణచాంద, సారంగాపూర్, సోన్, దిలావర్పూర్, నర్సాపూర్ మండలాల పరిధిలో 271 మందికి రూ. 2.72 కోట్ల విలువైన చెక్కులను నిర్మల్ పట్టణంలోని దివ్యగార్డెన్లోమంగళవారం అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులు చేపట్టి నీటి కరువు లేకుండా చేసిందన్నారు. పుష్కలంగా నీటి వనరులు ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనబోమని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగా రైతులను అప్రమత్తం చేస్తున్నదన్నారు. వరిని వీడి ఇతర పంటలు వేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నదని చెప్పారు. వర్షాకాలంలో రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. ఇప్పటివరకు 1. 20 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో రూ. 75 కోట్లను జమ చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ రఘనందన్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, ఆర్డీవో రమేశ్ రాథోడ్, జడ్పీటీసీ ఓస రాజేశ్వర్, టీఆర్ఎస్ నాయకులు ముత్యంరెడ్డి, అల్లోల సురేందర్‌రెడ్డి, సారంగాపూర్ ఎంపీపీ అట్ల మహిపాల్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ నల్ల వెంకట్రాంరెడ్డి, మార్కెట్ చైర్మన్ వంగ రవీందర్‌రెడ్డి, అడెల్లి పోచమ్మ ఆలయ కమిటీ చైర్మన్ అయిటి చందు, టీఆర్ఎస్ సారంగాపూర్ మండల కన్వీనర్ కొత్తపల్లి మాధవరావు, డీసీసీబీ డైరెక్టర్ ఐర నారాయణరెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, రాజమహ్మద్, నర్సారెడ్డి, ముద్రం దినేశ్, పాల్గొన్నారు.
బీజేపీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు. .
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మండలంలోని కనకాపూర్ కేఎన్ఆర్ గార్డెన్స్‌లో లక్ష్మణచాంద, మామడ మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నిర్మల్ డీసీసీబీ చైర్మన్ రఘునందన్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, టీఆర్ఎస్ లక్ష్మణచాంద మండల ఇన్చార్జి సురేందర్ రెడ్డి, జడ్పీటీసీ ఓస రాజేశ్వర్, ఆర్డీవో రమేశ్ రాథోడ్, తహసీల్దార్ కవితారెడ్డి, ఎంపీడీవో శేఖర్, నాయకులు ముత్యం రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.