బాసర: బాసర (Basara) శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి దాతలు వెండివీణను బహూకరించారు. నిజామాబాద్ జిల్లాలోని నవ్య భారతి గ్లోబల్ హై స్కూల్ సంస్థ చైర్మన్ క్యాతం శ్రీదేవి సంతోష్ దంపతులు అమ్మవారికి రూ.5 లక్షలతో 4 కేజీల వెండితో తయారు చేయించిన వెండి వీణను బహూకరించారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన వెండివీణకు ఆలయ అర్చకులు పూజలు చేశారు. దాతలకు అమ్మవారి తీర్థ ప్రసాదం అందజేసి వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ అమ్మవారికి మొక్కుల రూపంలో వెండివీణ అందజేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.