Bhainsa | నిర్మల్ జిల్లా భైంసాలో బంద్ కొనసాగుతోంది. నాగదేవత ఆలయంలో చోరీకి నిరసనగా హిందూ వాహిని ఇచ్చిన పిలుపు మేరకు దుకాణ సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. కాగా, నాగదేవత ఆలయంలో చోరీ కేసులో పలువురు నిందితులను పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటచేసుకోకుండా చూసేందుకు పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
భైంసా పట్టణ శివారులోని నాందేడ్ వెళ్లే మార్గంలో ఉన్న నాగదేవత ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. ఆలయ మెయిన్ గేటు తాళాన్ని పగులగొట్టి హుండీలోని కానుకలను దోచుకెళ్తారు. ఉదయం 9 గంటలకు స్థానికులు ఆలయానికి వెళ్లినప్పుడు చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కాగా, భైంసా పరిసరాల్లోని ఆలయాల్లో వరుస చోరీలు జరుగుతున్నా పోలీసులు అరికట్టకపోవడంపై హిందూవాహిని ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ బంద్కు పిలుపునిచ్చారు. నాగదేవత ఆలయంతో పాటు ఇటీవల భైంసా పట్టణంలోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం, నరసింహ స్వామి ఆలయం, పంచముఖి హనుమాన్ ఆలయాల్లో వరుసగా చోరీలు జరగడం ఆందోళన కలిగించాయి.