ఎదులాపురం, మే 3 : నేటి(ఆదివారం) నీట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం అధికారులకు గూగుల్ మీట్ ద్వారా దిశానిర్దేశం చేశారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని, పరీక్షలో పొరపాట్లు దొర్లకుండా పకడ్బందీగా నిర్వహించాలన్నారు. జిల్లాలో ఏడు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల బాలురు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల బాలికలు, ప్రభుత్వ బాలికల పాఠశాల భూక్తాపూర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్ట్స్, కామర్స్, బంగారి గూడ, తెలంగాణ మోడల్ సూల్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అభ్యర్థులు ఐడీ కార్డు, అడ్మిట్ కార్డ్(హాల్ టికెట్), 2 ఫొటోలు తీసుకురావాలన్నారు. జిల్లాలో 1,659 మంది పరీక్షకు హాజరు కానున్నారని, అభ్యర్థులకు పెన్నులు ఇస్తామని, కేంద్రాలకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు అనుమతిస్తామన్నారు.
150 మంది బందోబస్తు
నీట్ పరీక్ష కేంద్రాల వద్ద 150 మంది సి బ్బందితో బందోబస్తు ఏ ర్పాటు చేశామని ఎస్పీ అఖి ల్ మహాజన్ అన్నారు. శనివారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఎస్పీ సమావే శం ఏర్పాటు చేసి పలు సూ చనలు చేశారు. కేంద్రాల వద్ద పూర్తిగా తనిఖీ చేసి లోపలికి అనుమతించాలని తెలిపారు. కేంద్రాలను ఉద యం ఏడు గంటలకు తనిఖీ చేయాలనే సూచించారు. సరైన ధ్రువ పత్రాలు లేనిదే కేంద్రాలలోనికి అనుమతించకూడదని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని, జిరాక్స్ సెంటర్లో ఇంటర్నెట్ సెంటర్లకు అనుమతి ఉండదని తెలిపారు.
వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలి..
ఎండలో ఎకువ సేపు ఉండడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి వడదెబ్బ తగలవచ్చని, జిల్లావాసులు జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ రాజర్షి షా ఒక ప్రకటనలో తెలిపారు. వడదెబ్బ తగలకుండా ఉండేందుకు నీడలో ఉండడం, టోపీ, గొడుగు వంటివి ఉపయోగించడం, సూర్యరశ్మిని నిరోధించే దుస్తులు ధరించడం మంచిదన్నారు. తేలికపాటి వ స్త్రాలను ధరించాలని సూచించారు. మధ్యా హ్నం బయటకు వెళ్లడం మంచిది కాదన్నా రు. వీలైతే ఉదయం, సాయంత్రం గాలి చ ల్లగా ఉన్నప్పుడు బయటకు వెళ్లడం మంచిదన్నారు.
వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెం టనే వైద్య సహాయం తీసుకోవాలన్నారు. వడదెబ్బ లక్షణాలు (తలవొప్పి, వాంతులు, అధిక జ్వరం, తల తిరగడం, సృ్ప హ కో ల్పోవడం) కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. శరీరానికి తగినంత నీరు అందించడం చాలా అవసరం. ద్రవ పదార్థాలు ఎకువగా తీసుకోవాలి. ము ఖ్యంగా చల్లటి నీరు, ఓఆర్ఎస్ ద్రావణం, పండ్ల రసాలు వంటివి తీసుకోవాలన్నారు.