Phone Tapping | నా ఫోన్ ట్యాప్ చేస్తున్నరు.. బీఆర్ఎస్ పనేనని పొంగులేటి ఆరోపణ
Phone Tapping |‘నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. అది బీఆర్ఎస్ పనే’నంటూ రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. మంగళవారం ఖమ్మంలో మీడియాతో చిట్చాట్ నిర్వహించిన మంత్రి పలు అంశాలపై మాట్లాడారు.
Phone Tapping | ఖమ్మం, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. అది బీఆర్ఎస్ పనే’నంటూ రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. మంగళవారం ఖమ్మంలో మీడియాతో చిట్చాట్ నిర్వహించిన మంత్రి పలు అంశాలపై మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీకి చెందినవారే ప్రభుత్వ ఉద్యోగులతో తాను మాట్లాడిన మాటలు విన్నారంటే, తన ఫోన్ ట్యాపింగ్ అవుతుందన్న అనుమానం కలుగుతుందని పేర్కొన్నా రు. గతంలో వాడిన పరికరాలనే ఉపయోగిస్తున్నారా? అన్న అంశం తేలాల్సి ఉన్నదని, ప్రభుత్వం విచారించి తీరుతుందని స్పష్టంచేశారు.
ప్రభుత్వ ఉద్యోగులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం, ఉద్యోగులు సైతం వార్డుల వారీగా నియమించిన ఉద్యోగుల సంఖ్య, తదితర వివరాలను మంత్రికి వివరించిన ఆడియోను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఖమ్మంలో మీడియా స మావేశంలో వినిపించారు. వ్యవహారం బట్టబయలు కావడంతో పొంగులేటి జీర్ణించుకోలేకపోయారు.
ప్రభుత్వ ఉద్యోగులను కాంగ్రెస్ ఎన్నికలకు ఉపయోగించుకుంటుందన్న ఆరోపణలకు మంత్రి స్పందిస్తూ ఓటు ఎవరికి ఉన్నా అభ్యర్థించే హక్కు పార్టీకి ఉంటుందని సమాధానం ఇచ్చారు. తాను ముఖ్యమంత్రి రేసులో లేనని, పార్టీలో సాధారణ కార్యకర్తను మాత్రమేనని పునరుద్ఘాటించారు. టెలికాన్ఫరెన్స్పై బీఆర్ఎస్ ఫిర్యాదు చేయడంతో పొంగులేటి తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

