శ్రీరాంపూర్, ఏప్రిల్ 9 ః రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కేసీఆర్‌ను హ్యాట్రిక్ సీఎం చేయాలని మంచిర్యాల-ఆసిఫాబాద్ జిల్లాల ఇన్చార్జి నారదాసు లక్ష్మణ్‌రావు పిలుపునిచ్చారు. ఆదివారం మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని లక్ష్మి గార్డెన్లో పట్టణాధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముందుగా నాయకులు, కార్యకర్తలకు సీఎం కేసీఆర్ పం పించిన సందేశాన్ని వినిపించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ.. కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరారు. ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్కు 60 లక్షల సభ్యత్వం ఉందన్నారు. కేసీఆర్ బలమైన నాయకత్వం ఉందన్నారు. మన ప్రభుత్వ పథకాలను ప్ర చారం చేసుకోకుంటే.. ప్రతిపక్షాలు చేసే తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మే అవకాశం ఉందన్నారు. నిజాన్ని నిత్యం ప్రచారం చేయకుంటే అబద్ధమే నిజ మై దేశం నాశనమవుతుందన్నారు. ఇదీ ఎన్నికల సంవత్సరం. అందుకే నాయకులు, కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉండి పార్టీని ముందుకు తీసుకెళ్లాడానికే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
పార్టీ గెలుపునకు కృషి చేయాలి.. : ఎమ్మెల్యే దివాకర్‌రావు
క్రమశిక్షణ గల కార్యకర్తలుగా బీఆర్ఎస్, టీబీజీకేఎస్ గెలుపునకు కృషి చేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పిలుపునిచ్చారు. నిజాయితీగా ఉండే నాయకులను గెలిపించుకోవాలని కోరారు. సింగరేణికి సీఎం కేసీఆర్‌తోనే రక్షణ అని అన్నారు. రానున్న ఎన్నికల్లో గులాబీ జెండానే ఎగురుతుందనే ధీమా వ్యక్తం చేశారు.
మాది సంక్షేమ సర్కార్ : ఎమ్మెల్సీ విఠల్
రాష్ట్రంలో లక్ష కోట్లున్న బడ్జెట్‌ను 3 లక్షల కోట్లకు పెంచుకున్నామని ఎ మ్మెల్సీ దండె విఠల్ పేర్కొన్నారు. రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు చేసుకుంటున్నామని చెప్పారు. బీజేపీ ప్రభుత్వ వివక్షను ఎదుర్కొంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు. కార్యకర్తలు అప్రమత్తంగా ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
కారుణ్యంతో కళకళ : టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్
సింగరేణి సంస్థ కారుణ్య ఉద్యోగులతో కళకళలాడుతున్నదని టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో సింగరేణిదే కీలక పాత్రన్నారు. బీజేపీకి తెలంగాణలో పుట్టగతులు ఉండవని మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవిత ద్వారా సింగరేణి కార్మికులకు అనేక హక్కులు సాధించి పెట్టామన్నారు. సీఎం కేసీఆర్‌తోనే సింగరేణికి భవిష్యత్ అని వెల్లడించారు. ఉద్యోగ భద్రత ఉండాల న్నా, కారుణ్య ఉద్యోగాలు అమలు కావాలన్నా బీఆర్ఎస్ ప్రభుత్వం, టీబీజీకేఎస్ అధికారంలో ఉండాలని కోరారు. పార్టీ, యూనియన్ గెలుపునకు కార్మికులు, నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అందరికీ పథకాలు : నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్
కడుపులో పడ్డ బిడ్డ నుంచి కడతేరే ముసలి వరకు పథకాలు అమలు చేస్తున్నామని నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఈసంపెల్లి ప్రభాకర్ పేర్కొన్నారు. పథకాలపై గడప గడపకూ వెళ్లి అవగాహన కల్పించాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.