ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్ : ఆసిఫాబాద్( Asifabad) మండలంలో మొహర్రం (Muharram) వేడుకలను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. పది రోజులు క్రితం ప్రారంభమైన వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. రాజుర గ్రామంలో మొదటి రోజు బంగ్లా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి గుండాన్ని తవ్వి పీర్లను అలంకరించారు.
ప్రతి రోజు రాత్రి డప్పుచప్పులతో నృత్యాలు చేస్తూ, గ్రామాల్లో పీర్లను ఊరేగించారు. ఆఖరు రోజు ఆదివారం ప్రత్యేక పూజలు చేసి షర్బత్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు దుడిసే మారుతి, తిరుపతి, సుబ్బారావు, అరుణ్, విశ్వనాథ్, తరుణ్, సాయి, భావుజి, రోషన్ తదితరులు పాల్గొన్నారు.