ఆదిలాబాద్, మార్చి 3(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమ(సీసీఐ) విషయంలో బీజేపీ ఎంపీ నగేశ్, స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్లు తమ వైఖరిని స్పష్టం చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమను అమ్మకం దిశగా చర్యలు చేపట్టిందని.. ఇందులో భాగంగా పరిశ్రమలోని యంత్రాలు, ఇతర సామగ్రిని విక్రయించడానికి టెండర్లు పిలిచినట్లు తెలిపారు. ఆదిలాబాద్ ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు సీసీఐ అమ్మకాన్ని అడ్డుకుంటారా? లేదా? కేంద్రానికి వంత పాడుతారనే విషయంలో స్పష్టత ఇవ్వాలని సూచించారు. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన హన్స్‌రాజ్ గంగారాం సీసీఐని సందర్శించి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన కేంద్ర మంత్రులు కూడా సీసీఐని ప్రారంభిస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు సీసీఐని కేంద్రం అమ్మకానికి పెట్టి జిల్లాకు అన్యాయం చేస్తుంటే బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
బీజేపీ వైఖరికి నిరసనగా ఆందోళనలు
కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న జిల్లాకు సంబంధించిన పెండింగ్ ప్రా జెక్టుల విషయంలో బీజేపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళనలు చేపట్టనున్నట్లు మాజీ మంత్రి జోగు రామన్న తెలిపారు. ఆదిలాబా ద్, ఆర్మూర్ రైల్వేలైన్, సిమెంటు పరిశ్రమ, ఎయిర్ పోర్టు, ఆదిలాబాద్ గడ్ చాందూరి రైల్వేలైన్ విషయంలో కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. పదకొండేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ జిల్లా అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్య క్తం చేశారు. వరంగల్ జిల్లా మామునూర్‌కు విమానాశ్రయం మం జూరు చేసిన కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టును ఎం దుకు మరిచిందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో సీసీఐ విషయంలో పరిశ్రమల శాఖ మాజీ మంత్రి కేటీఆర్‌తో కలిసి కేంద్ర మంత్రులను కలిసినా ఫలి తం లేదన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు విజ్జగిరి నారాయణ, సాజిదుద్దీన్, ప్రభాకర్, అడప తిరుపతి, బట్టు సతీశ్, కుమ్ర రాజు, వినోద్, సాయి, ఆలం పాల్గొన్నారు.