ఖానాపూర్, మే 28: జూన్ 4న సీఎం కేసీఆర్ నిర్మల్‌కు రానున్నారని, ఈ నేపథ్యంలో ఖానాపూర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఎమ్మెల్యే రేఖానాయక్ పిలుపునిచ్చారు. పట్టణంలోని తన నివాసంలో పార్టీ ముఖ్య నాయకులతో ఆదివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వచ్చే నెల 4న నిర్మల్ కలెక్టరేట్ నూతన భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. దశాబ్ది ఉత్సవాలు పురస్కరించుకొని పలు అభివృద్ధి పనులకు శంకు స్థాపన చేస్తారని వెల్లడించారు.
ఖానాపూర్ నియోజకవర్గం నుంచి 25 వేల మంది తరలివచ్చేలా ప్రణాళికలు తయారుచేయాలని సూచించారు. అనంతరం పట్టణంలోని తెలుగు ప్రజల ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, ఎంపీపీ మొయిద్, పీఏసీఎస్ చైర్మన్లు ఇప్ప శ్రీనివాస్‌రెడ్డి, అమంద శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్మన్ శంకర్, మాజీ జడ్పీటీసీ రామునాయక్, నాయకులు రాజగంగన్న, రామిడి మహేశ్, వీరేశ్, శ్రీనివాస్, నగేశ్ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
సీఎం సభకు తరలిరావాలి
దస్తురాబాద్,మే 28 : ఈ నెల 4న నిర్మల్‌లో నిర్వహించనున్న సీఎం కేసీఆర్ సభకు తరలి వచ్చి విజయవంతం చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో ఆదివారం ఆమె సమావేశమై మాట్లాడారు. మండలం నుంచి 3వేల మంది సీఎం సభకు తరలిరవాలని పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వచ్చే నెల 2 నుంచి 22 వరకు నిర్వహించనున్న దశాబ్ది ఉత్సవాల్లో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేసి విజయవంతం చేయాలన్నారు. పదేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు.
అనంతరం మండలంలోని దేవునిగూడెం, మున్యాల, బుట్టాపూర్ గ్రామాలకు చెందిన పలువురికి సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సింగరి కిషన్,ఆయా గ్రామాల సర్పంచ్‌లు నాగవత్ సురేశ్ నాయక్,దుర్గం శంకర్, ఉప సర్పంచ్ ఒడిసే మాణిక్ రావు, ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ అప్పని రాజు, రైతు మండల అధ్యక్షుడు సిర్ప సంతోష్, బీఆర్ఎస్ మండల అధక్షుడు ముడికే అయిలయ్య యాదవ్, నాయకులు రామడుగు రమేశ్ రావు, దుర్గం రాజలింగం, బాదం లక్ష్మీరాజం, దీటి సత్తన్న, విజయ్,ఎండపెల్లి గంగన్న,అల్తాటి రాజేందర్, విలాస్ యాదవ్, శంకర్ గౌడ్, రాజన్న, గంగన్న, కార్యకర్తలు పాల్గొన్నారు.
సన్నాహక ససమావేశం
కడెం, మే 28: జూన్ 4న సీఎం కేసీఆర్ నిర్మల్ జిల్లా పర్యటనకు వస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరా వాలని ఎమ్మెల్యే రేఖానాయక్ సూచించారు. కడెం మండలకేంద్రంలోని హరిత రిసార్ట్‌లో పార్టీ కార్యకర్తలతో ఆదివారం సమావేశమై మాట్లాడారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలన్నారు. అంతకుముందు కార్యకర్తలతో అభివృద్ది పనుల విషయమై అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. కడెం, పెద్దూర్ నుంచి చిన్నక్యాంపు, కన్నాపూర్ మీదుగా కొండుకూర్, బెల్లాల్ చౌరస్తా వరకు సెంట్రల్ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేసేందుకు నాయకుల సమక్షంలో తీర్మానించారు.
మండలంలోని పలు గ్రామాల్లో అవసరమైన అభివృద్ధి పనుల విషయమై చర్చించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు జొన్నల చంద్రశేఖర్, మల్లారెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నల్ల జీవన్‌రెడ్డి, ఆత్మ చైర్మెన్ కానూరి సతీశ్, వైస్ ఎంపీపీ కట్టా శ్యాంసుందర్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు గోళ్ల వేణుగోపాల్, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు రఫీక్ హైమద్, మాజీ ఎంపీపీ చక్రపాణి, నాయకులు భుక్యా బాపురావు, తక్కళ్ల సత్యనారాయణ, బోయిని మంగ, కొండపురం లక్ష్మణ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు మల్లేశ్, మాజీ ఎంపీటీసీ గంగాధర్, మండల ఉపాధ్యక్షుడు కన్నె శ్రీనివాస్, అయా గ్రామాల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.