ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, జూన్ 9 : డాక్టర్ బీఆర్ అంబేదర్ ఆశయ సాధనకు కృషి చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి పేరొన్నారు. ఆదివారం బూరుగూడ గ్రామంలో కొత్తగా ఏ ర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు.
అనం తరం ఆమె మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత గా అంబేదర్ దేశానికి అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కొకిరాల విశ్వప్రసాద్, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీరా శ్యామ్ నాయక్, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, మారెట్ కమిటీ మాజీ చైర్మన్ మల్లేశ్, మాజీ సర్పంచ్ గోపాల్ తదితరులు ఉన్నారు.