నార్నూర్, మే 6 : కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఇస్తామని ప్రకటించిన తులం బంగారం ఏమైందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గాదిగూడ మండల కేంద్రంలోని రైతువేదికలో 40 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక ముందు కల్యాణలక్ష్మి సాయంతోపాటు తులం బంగారం ఇస్తామని ప్రకటించింది. 16 నెలలు దాటినా అమలు చేయడం లేదు. ప్రజలకు మోసపూరిత హామీలను ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు.
గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చూడాలని ఎంపీడీవో శ్రీనివాస్‌కు సూచించారు. నార్నూర్, గాదిగూడ మండలాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు లోకారి(కే), ఖండోతోపాటు పలు గ్రామాల్లో వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దాబా(కే)లో తల్లిదండ్రుల మృతితో అనాథలైన పిల్లలను పరామర్శించి అన్ని విధలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ముకాడే ఉత్తమ్, డిప్యూటీ తహసీల్దార్ విలాశ్, మాజీ ఎంపీపీ ఆడా చంద్రకళ రాజు, గాదిగూడ మాజీ వైస్ ఎంపీపీ మర్సువనే యోగేశ్, గాదిగూడ మండలాధ్యక్షుడు పుసం బాదిరావు, నార్నూర్ మండలాధ్యక్షుడు మెస్రం హన్మంత్‌రావు, రాయిసెంటర్ సార్ మెడి మెస్రం దుర్గు పటేల్, నార్నూర్ సర్పంచ్ల సంఘం మాజీ మండలాధ్యక్షుడు ఉర్వేత రూప్దేవు తదితరులు పాల్గొన్నారు.