ఇచ్చోడ,ఫిబ్రవరి,01: ఆధ్యాత్మికతోనే(Spirituality) మానసిక ప్రశాంతత లభిస్తుందని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ (MLA Jadhav Anil)అన్నారు. ఇచ్చొడ మండలం చించొలిలో జరుగుతున్న రాష్టసంత్ శ్రీ భగవాన్ బాబా మూర్తి ప్రాణ ప్రతిష్టపనం, కళాశారోహణ మహోత్సవానికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ముందుగా నానా మహరాజ్ జోల్కర్, దర్యవ్సింగ్ మహరాజ్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు అరటిపండ్లు, తాగునీళ్లు అందించారు. భక్తుల వెంట ర్యాలీలో ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..