Indian Railway | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పించారు. సాధారణ బడ్జెట్లో ఆర్థిక మంత్రి ఒక్కసారి కూడా భారత రైల్వేల గురించి ప్రస్తావించలేదు. అయితే, 2026 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో భారత రైల్వేలకు రూ.2.55 లక్షల కోట్లు కేటాయించారు. ఈ సారి ఎలాంటి కొత్త ప్రాజెక్టుల జోలికి వెళ్లకుండా.. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంపైనే దృష్టి సారించారు. ఆర్థిక మంత్రి 2024 సాధారణ బడ్జెట్లో రైల్వేకు రూ.2,55,200 కోట్లు కేటాయించగా.. అంతకు ముందు బడ్జెట్ 2023-24 సంవత్సరంలో రూ.2,40,200 కోట్ల కంటే 5 శాతం ఎక్కువ. జూలై 2024లో ఆర్థిక మంత్రి సమర్పించిన బడ్జెట్లో నిర్మలా సీతారామన్ కొత్త వందే భారత్ రైళ్లను ప్రకటించారు. భారతదేశంలో మూడు ప్రధాన రైల్వే ఆర్థిక కారిడార్లను నిర్మిస్తామని చెప్పారు. ఈ సారి బడ్జెట్లో రైల్వేలకు రూ.2,55,445 కోట్లు కేటాయించింది. ఇందులో రెవెన్యూ ఎక్స్పెండేచర్ రూరూ.3445 కోట్లు కాగా.. రూ.2,52,000 కోట్లు మూలధనం వ్యయం కోసం ఖర్చు చేయనున్నది.
బడ్జెట్లో పెన్షన్ ఫండ్‌లో రూ.66వేల కోట్లు, కొత్త లైన్లు వేయడానికి రూ.32,235 కోట్లు కేంద్రం ఖర్చు చేయనున్నది. రైల్వేలైన్ల లైన్ల డబ్లింగ్ కోసం రూ.32వేల కోట్లు, గేజ్ లైన్లుగా మార్చడానికి రూ.4,550 కోట్లు బడ్జెట్ నిర్ణయించారు. అలాగే, రైల్వే సిగ్నలింగ్, టెలికాం కోసం రూ.6800 కోట్లు, విద్యుత్ లైన్లకు రూ.6,150 కోట్లు, సిబ్బంది సంక్షేమానికి రూ.833 కోట్లు సాధారణ బడ్జెట్లో కేటాయించారు. రైల్వే సిబ్బంది శిక్షణ కోసం రూ.301 కోట్లు ఖర్చు చేయనున్నారు. రూ.45వేల కోట్లు రైల్వే భద్రతా నిధికి బదిలీ చేయనున్నది. రైలు ప్రమాదాలను తగ్గించడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోనున్నది. ప్రధాన రైల్వే మార్గాల్లో కవచ్ అప్‌గ్రేడ్ వెర్షన్ 4.O ని ఇన్స్టాల్ చేసే పని వేగంగా జరుగుతున్నది. అయితే, బడ్జెట్లో దీని గురించి ఆర్థిక మంత్రి ప్రకటన చేయలేదు. కానీ, బడ్జెట్ ఆర్థిక మంత్రి దీనికి సంబంధించి ఎటువంటి కొత్త ప్రకటన చేయలేదు. కానీ బడ్జెట్ కేటాయింపులో గతంలో ఇచ్చిన హామీలను నెవర్చేందుకు ప్రాధాన్యం ఇచ్చినట్లుగా రైల్వే వర్గాలు పేర్కొన్నాయి.