బోథ్‌లో బీఆర్ఎస్
ఆదిలాబాద్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల మిశ్రమ ఫలితా లు వచ్చాయి. బోథ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ విజయం సాధించగా, ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ విజయం సాధించారు.
- ఆదిలాబాద్‌లో బీజేపీ విజయం
- రెండు పార్టీల శ్రేణుల సంబురాలు
ఆదిలాబాద్, డిసెంబర్ 3(నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల మిశ్రమ ఫలితా లు వచ్చాయి. బోథ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ విజయం సాధించగా, ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ విజయం సాధించారు. రెండు నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు టీటీడీసీలో ప్రారంభమైంది. మొదటి పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కించారు. అనంతరం స్ట్రాంగ్‌రూంలలో భద్రపర్చిన ఈవీఎంను తీసుకువచ్చి 14 టేబుళ్లలో లెక్కించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ 6,147 ఓట్ల మెజార్టీ సాధించారు.
బోథ్ నుంచి బీఆర్ఎస్ అభ్య ర్థి అనిల్ జాదవ్ 23,023 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆదిలాబాద్ నియోజకవర్గం మొదటి రౌండ్ నుంచి బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ ఆధి క్యం ప్రదర్శించారు. 4,14, 16 17, 21 రౌండ్ల లో బీఆర్ఎస్ ఆధిక్యం ప్రదర్శించగా మిగతా 16 రౌండ్లలో బీజేపీ ఎక్కువ ఓట్లు సాధించింది. బోథ్ నియోజకవర్గంలో మొదటి నుంచి బీఆర్ఎస్ అధి క్యం కొనసాగింది. చివరి రౌండ్ వరకు అనిల్ జాద వ్ ఆధిక్యం కొనసాగిస్తూ వచ్చారు.
ఆదిలాబాద్ ని యోజకవర్గంలో 21రౌండ్లు ముగిసే సరికి 6,147 ఓట్లతో బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్, బోథ్ ని యోజకవర్గంలో 22రౌండ్ల ఓట్లు లెక్కింపు పూర్త య్యే సరికి 23,023 ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి అని ల్ జాదవ్ విజయం సాధించారు. ఆదిలాబాద్ ని యోజకవర్గం ఆర్వో స్రవంతి, బోథ్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి చాహత్ బాజ్‌పేయి గెలుపొందిన అభ్యర్థులకు పత్రాలను పంపిణీ చేశారు.
ప్రజల విజయం
ముఖ్యమంత్రి కేసీఆర్ నాపై విశ్వాసంతో బోథ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు. నియోజకవర్గంలో ప్రజల సమస్యలు పరిష్కరించే నాయకుడిగా నాకు మంచి పేరు ఉంది. ప్రజలు ఈ ఎన్నికల్లో నాపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారు. ఇది ప్రజల విజయంగా భావిస్తున్నాను. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి వారికి మరిన్ని సేవలు అందిస్తాను. – అనిల్‌జాదవ్, ఎమ్మెల్యే, బోథ్
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

