బోథ్, డిసెంబర్ 5 : సీఎం కేసీఆర్ పాలనలో పల్లె ప్రగతితో గ్రామాలను అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ వైపే గ్రామీణ ప్రజలు మొగ్గు చూపుతున్నారని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. శుక్రవారం నేరడిగొండ క్యాంపు కార్యాలయంలో బోథ్ మండలకేంద్రానికి చెందిన హమాలీ కార్మికులతో పాటు దాదాపు 50 మంది యువకులు పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పదేళ్ల పాటు బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరిగిందన్నారు.
మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లా నీరు, పంచాయతీ భవనాలు, చెత్త సేకరణ, ట్రాక్టర్ల ఏర్పాటు, హరితహారంతో మొక్కల పెంపకం, అవసరమైన రోడ్లు, డ్రైనేజీల నిర్మించినట్లు తెలిపారు. రైతుల సమస్యలు చర్చించుకునేందుకు రైతు వేదికలు కట్టించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎల్క రాజు, సురేందర్ యాదవ్, సుభాష్, రఫిక్, రఫీ, రమణాగౌడ్, సత్యనారాయణ పాల్గొన్నారు.
నేరడిగొండ, డిసెంబర్ 5 : మండలంలోని పట్పడితండాకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వారికి పార్టీకి కండువాలు కప్పి ఆహ్వానించారు. కేంద్రం కుల మతాల పేరిట, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాల పేరుతో రాజకీయం చేస్తున్నాయే తప్ప అభివృద్ధి చేయక పోవడంతోనే బీఆర్ఎస్లో చేరినట్లు పార్టీలో చేరిన జాదవ్ మోతీరాం, ఆడె దేవరావ్, ఆడే బలిరాం, ఆడె మహేందర్ పేర్కొన్నారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్‌ను ప్రజలే కాదు వారి పార్టీ నాయకులు కూడా నమ్మడం లేదన్నారు. ప్రజలు ఇప్పటికీ కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని గుర్తిస్తూ బీఆర్ఎస్నే కోరుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు రాథోడ్ సురేందర్, పవార్ బాలాజీ, ఆడె బన్సి, జాదవ్ భీమ్రావ్, జాదవ్ గంగాధర్, జాదవ్ సతీశ్, జాదవ్ గంగాధర్, జాదవ్ గోవర్ధన్, జాదవ్ మోహన్‌సింగ్, సరుల సామ, ఆడె హర్ణ, రాథోడ్ గులాబ్‌సింగ్ పాల్గొన్నారు.