కొనుగోళ్లలో సర్కారు విఫలం.. రైతులకు అండగా బీఆర్ఎస్
కాంగ్రెస్ సరారు పంటల కొనుగోళ్లలో పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే అనల్ జాదవ్ మండిపడ్డారు. ఎమ్మెల్యే శనివారం మండుటెండలో భీంపూర్ జొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.
- బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
తాంసి(భీంపూర్), మే 30 : కాంగ్రెస్ సరారు పంటల కొనుగోళ్లలో పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే అనల్ జాదవ్ మండిపడ్డారు. ఎమ్మెల్యే శనివారం మండుటెండలో భీంపూర్ జొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అకడ రైతుల కష్టాల ను స్వయంగా చూసి చలించిపోయారు. జొన్నలు విక్రయించడానికి వచ్చి వారాల తరబడి ఇళ్లకు వెళ్లడం లేదని గుబిడి రైతు లు కన్నీటితో ఎమ్మెల్యేకు చెప్పుకున్నారు. మండుటెండలకు కొందరు అనారోగ్యానికి గురవుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ. భీంపూర్ సహా పలు కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత, కాంటాల సమస్య, కూలీలు, లారీల సమస్య గురించి రైతులు మొరపెట్టుకుంటున్నా ఫలితం లేకపోయిందన్నారు.
జొన్న రైతుల ఇబ్బందుల గురించి కలెక్టర్‌తో మాట్లాడానని అన్నారు. భీంపూర్ కొనుగోలు కేంద్రంలో 500 మంది రైతులకు రోజూ మంచినీరు, అన్నదాన సౌకర్యం కల్పిస్తున్న బీఆర్ఎస్ నాయకులను అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే రైతులకు భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేస్తూ సమస్యలు తెలుసుకున్నారు. మండల కన్వీనర్ మేకల నాగయ్య, మాజీ జడ్పీటీసీ సుధాకర్, నరేందర్, గోవర్ధన్ యాదవ్, నాయకులు శ్రీకాంత్, కల్చప్ యాదవ్, అశోక్ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్‌కు షాక్ ఇచ్చిన బీఎంసీ
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
‘పంచాయతీల సమస్యలను పరిష్కరించాలి’
‘కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు మృతి కోదాడ పబ్లిక్ క్లబ్‌కు తీరని లోటు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

