కుప్టి నిర్మాణం చేపడుతాం
తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే కుప్టి ప్రాజెక్టు నిర్మాణం చేపడుతామని, దీంతో హైడల్ పవర్ ఉత్పత్తికి కూడా అనుకూలమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
- ప్రాజెక్టు హైడల్ పవర్ ఉత్పత్తికి అనుకూలం
- కుంటాల జలపాతంలో నిరంతరం నీరు పారుతుంది
- మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
- నేరడిగొండ సావర్గాం వద్ద వంతెన నిర్మాణానికి భూమిపూజ
- ఆరెపల్లిలో జగదాంబాదేవి, సేవాలాల్ ఆలయాల్లో విగ్రహాల ప్రతిష్ఠాపన
నేరడిగొండ, ఫిబ్రవరి 24 : తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే కుప్టి ప్రాజెక్టు నిర్మాణం చేపడుతామని, దీంతో హైడల్ పవర్ ఉత్పత్తికి కూడా అనుకూలమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మండలంలోని కుంటాల జలపాతానికి వెళ్లే రోడ్డు మార్గంలోని సావర్గాం గ్రామ సమీపంలో వంతెన నిర్మాణానికి శుక్రవారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కుప్టి ప్రాజెక్టు నిర్మాణంతో కుంటాల జలపాతంలో నిరంతరం నీరు పారుతుందన్నారు. దీంతో ఈ ప్రాంతం పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
నీటి నుంచి రాడార్ నిర్మాణ పనులు చేపడితే మరింత సుందరంగా తీర్చిదిద్దవచ్చని తెలిపారు. టూరిజం కోసం విదేశాలకు వెళ్తున్నారని, ఇక్కడ అభివృద్ధి జరిగితే విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని చెప్పారు. బోథ్ ఎక్స్‌రోడ్డు వద్ద ఏర్పాటవుతున్న అర్బన్ పార్కులో హరిత హోటల్ నిర్మాణం చేపట్టాల్సి ఉందన్నారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యాటకం పరంగా ఎంతో అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. అలాగే జలపాతం వద్ద వర్షాకాలంలో పర్యాటకులు ఎక్కువగా వస్తుండడంతో ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడ అమలవుతున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలోనూ లేవని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తేడాలు గమనించాలని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇక్కడి పథకాలు అమలవుతున్నాయా అని ఆ పార్టీల నాయకులను ప్రశ్నించారు. ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను త్వరలోనే లబ్ధిదారులకు అందించనున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరికీ పాస్‌బుక్‌లు అందిస్తామన్నారు. ఇటీవల మహారాష్ట్రలో పర్యటించిన సమయంలో ప్రజలను పులకరించగా, ఇక్కడి పథకాలు, కార్యక్రమాలు ఏవీ లేవని చెప్పారని తెలిపారు. ఇప్పుడు దేశ్‌కీ నేత కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీతోనే దేశంలో పథకాల అమలు పక్కాగా జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ‘కంటి వెలుగు’ అమలవుతున్న తరుణంలో ఢిల్లీ, పంజాబ్ వంటి రాష్ర్టా లు కూడా అమలు చేయాలని చూస్తున్నాయన్నా రు. అందుకే దేశ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు చూ స్తున్నారని వెల్లడించారు. నియోజకవర్గానికి 3 వే ల డబుల్ బెడ్రూం ఇండ్ల కోటా విడుదల కానుందని చెప్పారు. ముందుగా మండలంలోని ఆరెపల్లిలో నూతనంగా నిర్మించిన జగదాంబాదేవి, సే వాలాల్ ఆలయాల్లో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో బోథ్ ఎ మ్మెల్యే రాథోడ్ బాపూరావ్, జడ్పీటీసీ జాదవ్ అని ల్, ఎంపీపీ రాథోడ్ సజన్, వైస్ ఎంపీపీ మహేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రుక్మాణ్‌సింగ్, మాజీ చైర్మన్ దావుల భోజన్న, తిత్రే నారాయణసింగ్, బోథ్ మండల కన్వీనర్ దామెర్ల నారాయణరెడ్డి, సర్పంచులు పెంట వెంకటరమణ, సురేందర్‌యాదవ్ పీఏసీఎస్ చైర్మన్ మందుల రమేశ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ సాబ్లె నానక్‌సింగ్, ఉప సర్పంచ్ దేవేందర్‌రెడ్డి, నాయకులు చంద్రశేఖర్‌యాదవ్, జాదవ్ మహేందర్, శ్రీనివాస్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, ఉప్పు పోశెట్టి, ఎంపీటీసీ అంబేకర్ పండరి, గులాబ్‌సింగ్ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

