నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 19 : రాష్ట్రంపై కేంద్రానిది సవతి తల్లి ప్రేమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ పురపాలక సంఘ సర్వసభ్య అత్యవసర సమావేశంలో బుధవా రం ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణకు కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇచ్చింది లేదని, సొంత నిధులతో రాష్ట్రం అభివృద్ధి చేసుకుంటున్నామని పేర్కొన్నా రు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభు త్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. నిర్మల్ మున్సిపల్ అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు కేటాయించాలని సీఎంకు విన్నవిస్తామన్నారు. ప్రతి వార్డుకు నిధులు కేటాయిం చి అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం మాత్రం ప్రభుత్వాల ను కూలగొడుతూ ముఖ్యమంత్రులను మారుస్తున్నదని మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలను ప్రస్తావించారు.
బీజేపీ పాలిత రాష్ర్టాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తూ తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని కేం ద్రం తీరును తప్పుబట్టారు. రాష్ట్ర నిధులతో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అ మలు చేస్తున్నామని స్పష్టం చేశారు. కేం ద్రం కక్షసాధింపు ధోరణిని ప్రజలంతా గమనిస్తున్నారని వెల్లడించారు. పార్టీలు శాశ్వతం కాదని, ప్రజలే అంతిమ నిర్ణేతలని వ్యాఖ్యానించారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం చించోలి (బీ) సమీపంలోని వొకేషన్ సెంటర్ ఏర్పాటుపై బీజేపీ నేతలు నానా రాద్ధాం తం చేస్తున్నారన్నారు. ఈద్గాతో పాటు అక్కడ వొకేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. గతంలో ఆలయా ల నిర్మాణాలకు కూడా స్థలాన్ని కేటాయించామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వ ర్, కమిషనర్ రాజు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలోని సోఫీనగర్‌లో విశ్వకర్మ ఉ ద్యోగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 22న నిర్వహించే విశ్వ భగవాన్ శిలా విగ్రహ ప్రతిష్ఠాపనను విజయవం తం చేయాలని రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సం బంధించిన పోస్టర్లను బుధవారం మం త్రి క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రజలు పెద్దసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కాగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విశిష్ట అతిథిగా మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి హాజరవుతున్నారని సంఘ సభ్యులు తెలిపారు. వేవా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పూర్ణ చందర్, కోశాధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.