మామడ, సెప్టెంబర్ 7 : రైతులకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా చేపట్టిన ప్యాకేజీ-27(లక్ష్మీ నరసింహ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం) కెనాల్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న మామడ మండలం లింగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పాండ్యతండాకు చెందిన 19 మంది భూనిర్వాసితులకు రూ.58 లక్షల 20 వేలు, ఆరెపల్లి గ్రామంలోని 70 మందికి రూ.2 కోట్ల 98 లక్షల చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి రైతు బీమా, రైతు బంధు, రూ.లక్ష రుణమాఫీ వంటి అనేక పథకాలు అమలు చేసి వ్యవసాయాన్ని పండుగల మార్చిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తుందన్నారు.
గిరిజనులకు ఆరు నుంచి పది శాతానికి రిజర్వేషన్ పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలోని లక్ష 52 వేల గిరిజన కుటుంబాలకు నాలుగు లక్షల ఎకరాల అటవీ భూములను తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసిందన్నారు. పోడు భూముల్లో గిరి వికాస్ పథకం కింద బోర్లు వేయించడంతో పాటు రైతుబంధు అందించామన్నారు. అనంతరం రాయదారి గ్రామానికి చెందిన గబ్బర్‌సింగ్ ఇటీవల మరణించగా రైతుబీమా కింద మంజూరైన రూ.5లక్షల చెక్కును కుటుంబ సభ్యులకు మంత్రి అందజేశారు. ఆరెపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలకు మన ఊరు -మన బడిలో భాగంగా వచ్చిన బెంచీలు, నూతనంగా నిర్మించిన ప్రహరీని ఆయన ప్రారంభించారు. జగదాంబ సేవాలాల్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు అంబిబాయి గంగారాం, అరవింద్‌రావు, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, ఈఈ రామారావు, డీఎస్పీ గంగారెడ్డి, వైస్‌ఎంపీపీ లింగారెడ్డి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ చంద్రశేఖర్‌గౌడ్, తహసీల్దార్ సర్పరాజ్ నవాజ్, ఎంపీడీవో రమేశ్, పీఏసీఎస్ ఉపాధ్యక్షుడు భాస్కర్‌రావు, నాయకులు కైలాస్, రాందాస్, నవీన్‌రావు, అంబాజీ, మల్లయ్య, వికాస్‌రెడ్డి, గణేశ్, మహేశ్వర్‌రావు, మహేందర్‌రావు, అశోక్, రఘ,రత్నయ్య, తదితరులు ఉన్నారు.
నిర్మల్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 200 మంది బీఆర్ఎస్లో చేరారు. ఇందులో నిర్మల్ రూరల్ మండలం న్యూపోచంపాడ్, దిలావర్పూర్ మండలం, లక్ష్మణచాంద మండలం కనకాపూర్ గ్రామానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను వీడి మంత్ర ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో గురువారం బీఆర్ఎస్లో చేరారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, జరుగుతున్నఅభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రఘునందన్ రెడ్డి, వోస రాజేశ్వర్, అల్లోల సురేందర్ రెడ్డి, మేకల రాజేందర్, ఆయా మండల అధ్యక్షులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గండిరామన్న దత్తసాయి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్‌లోని గండిరామన్న దత్తసాయి ఆలయంలో ఆలయ చైర్మన్ లక్కాడి జగన్మోహన్ రెడ్డి, జైపాల్ రెడ్డి తల్లిదండ్రులైన లక్కాడి రాంరెడ్డి కృష్ణవేణి జ్ఞాపకార్థం నిర్మించిన గోశాలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి-విజయలక్ష్మి దంపతులు ప్రారంభించారు. గోశాలలో శ్రీ కృష్ణుడు, గోవులకు పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గండిరామన్న ఆలయానికి కోట్లాది రూపాయలు మంజూరు చేయగా, ఇప్పటికే ఆలయం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందన్నారు. నూతన హంగులతో నిర్మించిన ఈ ఆలయం టూరిజం స్పాట్‌గా మారిందని అన్నారు. అనంతరం ఆలయ చైర్మన్ మంత్రి దంపతులను శాలువాతో సన్మాంచారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, దేవరకోట ఆలయ కమిటీ చైర్మన్ శ్రీధర్, కౌన్సిలర్ ఎడిపెల్లి నరేందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.