నిర్మల్ అర్బన్, అక్టోబర్ 2 : యువత మహనీయుల అడుగుజాడల్లో నడిచి వారి ఆశయాలను నెరవేర్చాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని సోమవారం నిర్మల్‌లో ఘనంగా నిర్వహించారు. గాంధీ కూరగాయల మార్కెట్లోని గాంధీ విగ్రహానికి కలెక్టర్ వరుణ్ రెడ్డితో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం గాంధీ తన జీవితాన్ని త్యాగం చేశారని గుర్తు చేశారు. గ్రామ స్వరాజ్య స్థాపన కోసం ఎంతో కృషి చేశారని అని అన్నారు. గాంధీ పార్కు అభివృద్ధికి నిధులు వెచ్చిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, కమిషనర్ రాజు, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేదర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, పాకాల రాంచందర్, దేవరకోట ఆలయ చైర్మన్ ఆమెడ శ్రీధర్, మాజీ చైర్మన్ ఆమెడ కిషన్, కౌన్సిలర్లు గండ్రత్ రమణ, విజయలక్ష్మీపొశెట్టి, బిట్లింగ్ నవీన్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ టౌన్, అక్టోబర్ 2 : నిర్మల్ కలెక్టరేట్ సమీకృత భవనంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్వచ్ఛభారత్, స్వచ్ఛతే సేవ కార్యక్రమాలపై కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నిర్మల్ కలెక్టర్ వరుణ్‌రెడ్డి, అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, ఎఫ్ఎసీఎస్ మాజీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, ఆర్డీవో రత్నాకల్యాణి, ఏఎంసీ వైస్‌చైర్మన్ శ్రీకాంత్‌యాదవ్ పాల్గొన్నారు.
గాంధీ మార్గంలోనే బంగారు తెలంగాణ
ఉట్నూర్, అక్టోబర్ 2 : జాతిపిత మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యమే సహకారం దిశగా సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నట్లు జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో గాంధీజీ జయంతి ఘనంగా నిర్వహించారు. జడ్పీ చైర్మన్‌తో కలిసి ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్‌నాయక్ మహాత్ముడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పంద్ర జైవంత్‌రావ్, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేశ్, జీవ వైవిధ్య కమిటీ సభ్యుడు మర్సుకోల తిరుపతి, నాయకులు, కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఖానాపూర్ టౌన్, అక్టోబర్ 2 : గాంధీజీ సిద్ధాంతాలు యువత అదర్శంగా తీసుకోవాలని ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్‌నాయక్ అన్నారు. జాన్సన్ నాయక్ నివాసంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాళ్లపల్లి రాజగంగన్న, కడెం జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు, ప్రజాప్రతినిధులు కావలి సంతోష్, రాథోడ్ రామునాయక్, కొక్కుల ప్రదీప్, బలగం రమేశ్, సాబీర్ పాషా, సల్ల వంశీ, ఎనుగుల రాజేశ్, అంగార్ నవీన్, ఎడ్ల రాజన్న, షేక్ షఫీ పాల్గొన్నారు.
గాంధీజీ ఆశయ సాధనకు కృషి
ఎదులాపురం, అక్టోబర్ 2 : గాంధీజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జైలులో గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన ఖైదీల సంక్షేమ దినోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. కలెక్టర్, జిల్లా అదనపు సెషన్ జడ్జి , అధికారులు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులఅర్పించారు. వివిధ పోటీల్లో గెలుపొందిన ఖైదీలకు కలెక్టర్, న్యాయముర్తి బహుమతులు అందజేశారు. అంతకుముందు జైలు పరిసరాలను వారు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పీసీఆర్ కోర్టు న్యాయముర్తి దుర్గారాణి, జిల్లా జైలు పర్యవేక్షకుడు అశోక్ కుమార్, డీఎస్పీ వీ ఉమేందర్, డీఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమాదేశ్ పాండే, డీపీఆర్వో విష్ణువర్ధన్, న్యాయవాదులు గంగారాం, ఉమేశ్డొలే, జైలు సిబ్బంది ,ఖైదీలు పాల్గొన్నారు.
గాంధీజీ కలలను సాకారం చేసే దిశగా సీఎం కేసీఆర్ పాలన
ఎదులాపురం,అక్టోబర్ 2 : మహాత్మాగాంధీ కలలను సాకారం చేసే దిశగా సీఎం కేసీఆర్ సమర్థవంతమైన పాలన అందిస్తున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకొని ఆదిలాబాద్‌లోని గాంధీ చౌక్‌లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. సంఘం నేతలతో కలిసి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ సుందరీకరణలో భాగంగా గాంధీ చౌక్ అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే గాంధీపార్క్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగు రామన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఆర్వో రాథోడ్ రమేశ్, డీవైఎస్వో వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అలాల్ అజయ్, కౌన్సిలర్లు బండారి సతీశ్, అశోక్ స్వామి, నాయకులు మెట్టుప్రహ్లాద్, రాంకుమార్, జంగుపటేల్, కుమ్ర రాజు తదితరులు పాల్గొన్నారు.