సోన్, ఆగస్టు 28 : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభు త్వం అందజేస్తున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలకు ఆకర్శి తులై ప్రతిపక్షాల పార్టీల నుంచి వందలాది మంది బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. సోమ వారం సాయంత్రం నిర్మల్ మండలం కొండాపూర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పలువురు బీజేపీ జిల్లా స్థాయి నాయకులు మంత్రి సమక్షంలో బీఆర్ ఎస్‌లో చేరారు. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి అమరవేణి నర్సాగౌడ్, సారంగాపూర్ మండలానికి చెందిన బీజేపీ మండల నాయకుడు వంగ భూమా రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 200 మంది బీజేపీ గ్రామస్థాయి నాయకులు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. అందరం కలిసికట్టుగా అభివృద్ధి, సంక్షేమం వైపు పురోగ మిద్దామని పిలుపునిచ్చారు.
పార్టీలో చేరిన నాయ కులు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి తమ పూర్తిస్థాయి మద్దతు తెలిపేందుకే పార్టీలో చేరామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను గ్రామస్థాయిలో తిప్పికొట్టాలని వారు పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారిలో నర్సాపూర్ (జీ) మండలం నసీరాబాద్, రాంపూర్, దర్యాపూర్, సారంగాపూర్ మండలం బీరవెల్లి, ప్యారమూర్, వంజర్, తదితర గ్రామాలకు చెందిన వందలాది మంది బీజేపీ కార్యకర్తలు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మాజీ ఎఫ్ఏసీఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, సారంగా పూర్ ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, అడెల్లి ఆలయ కమిటీ చైర్మన్ అయిటి చందు, మాజీ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, నాయకులు అప్పాల ప్రభాకర్, ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లోల మురళీధర్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తోకల అనిల్, శ్రీనివాస్‌రెడ్డి, పాకాల రాం చందర్, రవీందర్‌రెడ్డి, గౌడ సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.