ఆదిలాబాద్, జనవరి 26(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ బృందం సభ్యులు పర్యటించారు. ఈ క్రమంలో రైతు ఆత్మహత్యలకు సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. 13 నెలలుగా రైతు సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోయి నా.. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు తమ వద్దకు వచ్చి తమగోడును ఆలకించడంపై రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. చాలా రోజుల తర్వా త రైతు సమస్యల పరిష్కారానికి వేదిక దొరికిందని రైతులు అభిప్రాయపడ్డారు. కమిటీ పర్యటనలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సాగులో సమస్యలు బహిర్గతమయ్యాయి. పెట్టుబడి కోసం ఇబ్బందులు, బ్యాం కులు, ప్రైవేటు అప్పులు, బ్యాంకర్ల వేధింపులు, పంట నష్టం, అమ్మకాల్లో ఇబ్బందులను అధ్యయన కమిటీ బృందానికి తెలియజేశారు. కాంగ్రెస్ పాలనలో విసుగు చెందిన రైతులు ఆందోళనలు చెందవద్దని సభ్యులు సూచించారు. అన్నదాతల తరపున అసెంబ్లీ, శాసన మండలిలో తాము పోరాడుతామని, అఘాయిత్యాలకు పాల్పడవద్దని, న్యాయం కోసం పోరాడుతామని సూచించారు.
ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా కమిటీ సభ్యులు ఆదిలాబాద్ రూరల్ మండలం, రామాయి యాపల్‌గూడ గ్రామంలో రైతులు సాగు చేస్తున్న పంటలను పరిశీలించారు. రామాయిలో మిర్చి సాగు చేస్తున్న రైతు ఈశ్వర్‌తో మాట్లాడారు. కౌలు రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సాయం అందుతుందని తాను ఐదు ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నట్లు రైతు ఈశ్వర్ తెలిపారు. ఎకరాకు రూ. 31,600 చెల్లిస్తున్నారు. ప్రభుత్వం అందించే డబ్బుల్లో కొన్ని కలుపుకుని కౌలు డబ్బులు చెల్లిద్దామనుకుంటే ప్రభుత్వం కౌలు రైతులకు ఇచ్చిన హామీని మరిచిపో యిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నమ్మి మోసపోయినట్లు తెలిపారు. దీంతో తాను అప్పులు చేయాల్సి వస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ అధికా రంలో ఉండగా మిర్చి పంట క్వింటాలుకు రూ.28 వేల ధర రాగా, ఇప్పుడు కేవలం రూ.12 వేలు మాత్రమే వస్తున్నాయన్నారు. రైతులకు ప్రభుత్వం ఇస్తామన్ని బోనస్ రూ.500 రావడం లేదని కమిటీ సభ్యులకు కౌలు రైతు ఈశ్వర్ వివరించారు.
మా కుటుంబానికి యాపల్‌గూడ శివారులో 4.10 ఎకరాల భూమి ఉన్నది. అందులో పత్తి, కంది వేస్తాం. ఈసారి దిగుబడి రాలేదు. ధరలు కూడా లేకుండే. ఇక మహారా ష్ట్ర బ్యాంకులో మాకు ఉన్న రూ.2 లక్షల రుణం మాఫీ కాలేదు. ఇక కాంగ్రెస్ సర్కారు ఇస్తామన్న ఒక్క పథకం కూడా ఇవ్వలేదు. దీనితో ఈ పాలనతో విసుగు అనిపిస్తు న్నది. అపుడు కేసీఆర్ సార్ ఉండంగ ఒక పథకం ఇస్తా మంటే ఇచ్చేస్తుండె. ఇప్పుడు రైతు భరోసా కూడా ఇగో అగో అని కాలం జరుపు తున్నరు. నాకే కాదు మా గ్రామంల అందరూ కాంగ్రెస్ పాలనపై నారాజుగ ఉన్న రు. ఇక మొన్న బీఆర్ఎస్ అధ్యయన కమిటీ వారు అచ్చి మా అసుంటోళ్లకు మస్తు ధైర్యం చెప్పిండ్రు.
కేసీఆర్ సారు రెండు పంటలకు సమయా నికి రైతుబంధు వేస్తుండే. అవి పెట్టుబడికి సరిపోతుండే. ఇపుడు రుణమాఫీ లేదు, రైతుభరోసాపై నమ్మకం లేదు. మా కుటుంబానికి మూడెకరాల భూమి ఉండగా.. మహారాష్ట్ర బ్యాంకుల రూ.2 లక్షల పంట రుణం ఉన్నది. గిప్పటికీ రుణ మాఫీ కాలే. మండలంలోని ఒక్క గ్రామంలనే పథకాలు మొదలు పెడితే.. ఇగ మిగిలిన గ్రామాల గతి ఎట్ల. మిగతా గ్రామాలకు అందుతాయనే నమ్మకం లేదు.
కాంగ్రెస్ సర్కారు రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయకపోవడం, రైతు భరోసా ఇవ్వక పోవడంతో ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతున్నాం. దీనికి ఇటీవల జరుగుతున్న రైతు ఆత్మహత్యలే అద్దం పడుతున్నాయి. కేసీఆర్ పాలనలో అయితే సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొలేదు. గత శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ పర్యటించి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల్లో ధైర్యం నింపింది. అన్నదాతతోపాటు అన్ని వర్గాల ప్రజలు ఈ కాంగ్రెస్ పాలనలో విసిగిపోయారు. మండలానికో గ్రామాన్ని ఎంపిక చేసి పథకాలను ప్రారంభించడం, మిగతా గ్రామాలవారిని విస్మరించడం అయోమయానికి గురి చేస్తున్నది. ఇప్పటికైనా సర్కారు రైతు కూలీలకు న్యాయం చేయాలి.
కమిటీ సభ్యులు ఆదిలాబాద్ రూరల్ మండలంలోని యాపల్‌గూడలో శనగ పంటలో పనిచేస్తున్న మహిళా కూలీలతో మాట్లాడారు. వారు తమ సమస్యలను సభ్యులకు ఏకరువు పెట్టారు. వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ.12 వేలు ఏడాది గడిచినా రావడం లేదని, మహాలక్ష్మీ పథకంలో భాగంగా నెలకు రూ.2500 డబ్బులు రావడం లేదన్నారు. పింఛన్లను పెంచుతామని ప్రకటించిన ప్రభుత్వం మాట మరిచిందని తెలిపారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాటలు అబద్ధాలు అని వారు సభ్యులకు సూచించారు.
రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ సభ్యులకు రైతులు ఏడాదికాలంలో పడుతున్న ఇబ్బందులను తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నమ్మి ఓటు వేశామని, ఇప్పుడు మోసపోవాల్సి వస్తున్నదని అన్నారు. రైతు భరోసా పథకంలో భాగంగా ఎకరాకు రూ.15 వేల పెట్టుబడి సాయం రెండు పంటలకు రాలేదని, దీంతో అప్పులు చేసి సాగు చేయాల్సి వస్తుందన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ విషయంలో ప్రభుత్వ తీరుపై అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులకు రూ. 2 లక్షల రుణం అందడం లేద ని, రేషన్‌కార్డు లేకున్నా, కుటుంబం మొత్తంలో రూ. 2 లక్షలకు రుణం ఉన్నవారికి ప్రభుత్వం మాఫీ చేయలేదని రైతులు తెలిపారు. గతంలో మా జీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం రైతులందరికీ రూ. ఒక లక్ష బ్యాంక్ లోన్ రద్దు చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం అందరు రైతులకు రూ. 2 లక్షల రుణాలు మాఫీ చేయాలని కోరారు. పంటల విక్రయాల్లో ఇబ్బందులు పడుతున్నామని, కష్టపడి సాగు చేసిన పంటలకు మద్దతు ధర లభించడం లేదన్నారు. పత్తి క్వింటాలుకు రూ.7,521 ఉండగా.. సీసీఐ రూ.100 తగ్గించి రూ.7,421 చెల్లిస్తుందన్నారు. బీఆర్ఎస్ పాలనలో సం తోషంగా ఉన్నామని, ఏడాది కాంగ్రెస్ పాలనలో వ్యవసాయరంగాన్ని ప్ర భుత్వాన్ని పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. బీఆర్ఎస్ బృందం పర్యటనలో రైతుల ధైన్యస్థితి వెలుగులోకి వచ్చింది.