నేరడిగొండ ఫిబ్రవరి 1: కుష్టు,క్షయ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని హెచ్ఈవో రవీందర్ సూచించారు. శనివారం నేరడిగొండ మండలంలోని కుంటాల బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా వ్యాధులను దూరం పెట్టొచ్చన్నారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రత పాటించాలని ఆయన సూచించారు. అనంతరం విద్యార్థినులకు కుష్టు , క్షయ వ్యాధి పట్ల అవగాహన కల్పించారు.18మంది విద్యార్థినులకు షాంపూల్స్ సేకరించారు.ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ నరేందర్ రెడ్డి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..